చెట్టులో మహత్యమట.. మిస్టరీ ఎంటో మీరూ చూడండి?

ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వేపచెట్టు మహత్యం అంటూ జనాలు తెగ సందడి చేస్తున్నారు. జిల్లాలోని చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంలో వేపచెట్టుకు ఉన్న ఒకటి నాగుపాము పడగ పోలి కనిపించింది. దీని ఆకృతి పాములాగే ఉండడంతో ఇంకేముంది జనాలకు భక్తి పారవశ్యం పెరిగింది. దీనిని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు తరలిస్తున్నారు. అంతేకాదు..  స్థానికులు పూజలు సైతం చేస్తున్నారు. దేవుని మహత్యం ఉందని.. జనాలు నమ్ముతున్నారు. కానీ అలాంటివి సహజం అని హేతువాదులంటున్నారు. మొత్తానికి జిల్లాలో ఇదో పెద్ద టాపిక్ అయింది.. జనాల్లో భక్తిపారవశ్యం నింపిన ఈ చిత్రం ఈ కింద వీడియోలో వీక్షించండి.

Recommended For You