పదవితో బాధ్యత పెరిగింది..!

టీమిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన పదవి తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెబుతున్నాడు. తన హయాంలో ఆటగాళ్ల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ప్రతిభావంతులకే జట్టులో చోటు దక్కుతుందని స్పష్టం చేశాడు. చీఫ్‌ సెలెక్టర్‌గా వచ్చే వరల్డ్‌కప్‌ వరకూ పూర్తి స్థాయి యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేశానని, దాన్ని అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.  ఈ పదవిని ముందే ఊహించా. పదవితో పాటు కొన్నిబాధ్యతలు కూడా వస్తాయి. టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌ పదవి అనేది చాలా బాధ్యత, సవాలుతో కూడిన పని. వేలాది మంది కలలను సాకా రం చేసే పదవి ఇది.  గత దశాబ్దంలో సచిన, ద్రావిడ్‌, గంగూలీ, జవగళ్‌ శ్రీనాథ్‌, సెహ్వాగ్‌ వంటి దిగ్గజాలు జట్టులో ఉన్నారు. వారం తా దశాబ్ద కాలం పాటు కలిసి కట్టుగా ఆడినందుకే ఆ స్థాయికి చేరుకున్నారు. యువ క్రీడాకారులు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రస్తుత టెస్టు జట్టుకు యువకుడైన కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డేలకు ధోనీ అందుబాటులో ఉన్నాడు. వీళ్ల నాయకత్వంలో భారత్‌ బాగా రాణిస్తోంది. ఇప్పుడు జట్టులో ఉన్న కొత్త ఆటగాళ్ళు నిలదొక్కుకోవడానికి రాబోయే 13 టెస్ట్‌లు మంచి ప్లాట్‌ఫామ్‌గా భావించవచ్చు.

పదవికే వన్నె తెస్తా..
పదవికే వన్నె తెస్తా..

Recommended For You

Comments are closed.