మోడీ మ‌న‌సులో ఈ ఇద్ద‌రూ….!

ఉత్తరాదిలో శాసిస్తున్నా.. ద‌క్ష‌ణాదిన‌ క‌ర్నాట‌క మిన‌హా మ‌రెక్క‌డా అధికారం బీజేపీకి అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. తోక‌పార్టీగానే ఉండాల్సి వ‌స్తుంది త‌ప్ప‌.. సొంతంగా అధికారం క‌ల‌గానే మారింది. ఇప్పుడున్న నాయ‌క‌త్వంతో బ‌లోపేతం అసాద్య‌మ‌ని అధిష్టానం కూడా అంచ‌నాకు వ‌చ్చింది. ప‌క్కా వ్యూహంతో.. స‌రికొత్త ప్ర‌ణాళిక‌ల‌తో అడుగుపెడితే 2019 కాక‌పోయినా.. 2024కు సొంతంగా అధికారం అందుకోవ‌చ్చ‌ని అధినాయ‌క‌త్వం ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇందుకోసం మోడీ-అమిత్‌షా ద్వ‌యం ఫుల్ క్లారిటీగా ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స‌రికొత్త నాయ‌క‌త్వం స‌మయానికి తెర‌ముందుకు వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఏపీలో వ‌ప‌నాస్త్రం..!
ఏపీలో టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ భ‌విష్య‌త్తులో సొంతంగా ఎద‌గాల‌న్న ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంది. నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, పురంధేశ్వ‌రి వంటి సీనియ‌ర్ల‌ను పార్టీలోకి ఆహ్వానించినా ఫ‌లితం లేక‌పోయింది. ఉన్న నాయ‌కులు కూడా మాస్ లీడ‌ర్లు కాదు.. దీంతో పార్టీ ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా త‌యారైంది. అందుకే కొత్త‌గా ప‌వ‌నాస్త్రం సంధిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మోడీ ఎప్ప‌టికైనా వ‌ప‌న్‌ను పార్టీలోకి తీసుక‌వ‌స్తార‌ని.. ప్ర‌స్తుతానికి టీడీపీతో పొత్తు నేప‌థ్యంలో సైలెంట్‌గా ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీగా జ‌నాల్లోకి వ‌చ్చినా.. భ‌విష్య‌త్తులో బీజేపీ గూటికి చేరుతార‌న్న‌ ప్ర‌చారం బీజేపీ శ్రేణుల్లో విసృతంగా ఉంది. ప‌వ‌న్‌ను పార్టీ ప్ర‌చార సార‌ధిని చేస్తార‌ని చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక హోదాపై కూడా హామీ ఇచ్చి త‌న‌దారికి తీసుకొస్తార‌ని పార్టీ నేత‌లంటున్నారు. ప‌వ‌న్ వెంట‌ యువ‌శ‌క్తి బాగానే ఉంది.. దీనికి తోడు మెజార్టీ ఓటర్లు ఉన్న కాపు సామాజిక వ‌ర్గం క‌లిసివ‌స్తుంది. అందుకే పార్టీకి ఆశాజ‌న‌కంగా వ‌ప‌న్ క‌నిపిస్తున్నారు. మ‌రి సాకారం అవుతుందా? స‌మీక‌ర‌ణాలు అనుకున్నంత సుల‌భంగా క‌లుస్తాయా?

హారీష్‌రావుకు గాల‌మేస్తారా?
ఏపీలో వ‌ప‌న్ క‌ళ్యాణ్ క‌మ‌ల‌నాధుల చూపులో ఉంటే… తెలంగాణాలో హ‌రీష్‌రావుపై న‌జ‌ర్ పెట్టింద‌ట‌. కేసీఆర్ కుటుంబంలో రాజ‌కీయ ఆధిప‌త్య‌పోరు ఉంద‌ని బీజేపీ భావిస్తుంద‌ట‌. భ‌విష్య‌త్తులో కేసీఆర్ రాజ‌కీయంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే బాధ్య‌త‌లు కేటీఆర్‌కు అప్ప‌గిస్తారని ఇప్ప‌టికే సంకేతాలు ఉన్నాయి. అదే జ‌రిగితే హ‌రీష్‌రావు పార్టీలో ఇమ‌డ‌గ‌ల‌రా? ఇదే బీజేపీ ఆలోచ‌ల‌కు కార‌ణ‌మ‌ట‌. కేసీఆర్ త‌ర్వాత కిందిస్థాయిలో పార్టీలోనూ క్యాడ‌ర్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న నాయ‌కుడు హ‌రీష్‌రావు. క‌ష్ట‌ప‌డే త‌త్వం ఆయ‌న‌కంటూ అన్ని జిల్లాల్లో క్యాడ‌ర్‌ను సంపాదించిపెట్టింది. ప్ర‌తిగ్రామంలో హ‌రీష్‌రావుకు ఇద్ద‌రు లేదా ముగ్గురు కార్య‌క‌ర్త‌లు అయినా స‌పోర్టుగా ఉన్నారు. అంతే కాదు ఉన్న‌ప‌ళంగా బ‌య‌ట‌కు వ‌చ్చినా 10 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకునే స‌త్తా ఉంద‌ని నిఘా వ‌ర్గాలు బీజేపీ అధిష్టానం వ‌ద్ద చెప్పాయ‌ట‌. కేటీఆర్ చేతికి పార్టీ వెళ్లిన ప‌క్షంలో హ‌రీష్‌రావును త‌మ‌దారికి తీసుకొస్తే క‌మ‌లానికి జ‌వ‌స‌త్వాలు నింప‌వ‌చ్చ‌ని బీజేపీ నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింద‌ట‌. అమిత్ షా, మోడీ ఇదే అంశంపై ఢిల్లీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన నాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌రీష్‌రావు సిఎం కావాల‌న్నా కూడా ఖ‌చ్చితంగా పెద్ద పార్టీ మ‌ద్ద‌తు అవ‌స‌రం.. టిఆర్ఎస్‌లో అవ‌కాశాలు అనుమాన‌మే.. అలాగ‌ని సొంతంగా పార్టీ పెట్టినా డ‌బ్బుతో కూడిన వ్య‌వ‌హారం.. అందుకే బీజేపీ ఇవ‌న్నీ ఆలోచించే హ‌రీష్‌కు గాలం వేసే ప‌నిలో ప‌డిన‌ట్టు బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే హ‌రీష్‌రావుకు సంబంధించిన స‌మాచారాన్ని కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు తెప్పించుకుంటున్న‌ట్టు ప్ర‌చారం ఉంది. ఇందులో నిజ‌మెంతో కానీ బీజేపీ నాయ‌కులు మాత్రం ఆఫ్‌దిరికార్డు ప్ర‌చారం చేసుకుంటున్నారు.
సాద్య‌మేనా…!
హ‌రీష్‌రావు, వ‌ప‌న‌క‌ళ్యాణ్‌లు పార్టీకి బ‌లంగా మార‌తార‌ని బీజేపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ వారిరువురు ఉన్న పార్టీల‌ను కాద‌ని రావ‌డం అనుమాన‌మే. రాజ‌కీయంగా త‌న‌కు జీవితాన్ని ఇచ్చిన కేసీఆర్‌ను కాద‌ని ఎలాంటి ప‌రిస్థితుల్లో హ‌రీష్‌రావు బ‌య‌ట‌కు రార‌ని ఆయ‌న వ‌ర్గం బ‌లంగా చెబుతోంది. కేసీఆర్ విశ్వాసం కూడా అదే. ఇక ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీని స్థాపించి బీజేపీలో విలీనం చేస్తే అన్న చిరంజీవికి ఆయ‌న‌కు తేడా ఏముంద‌న్న విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. అందుకే ఇవ‌న్నీ సాద్యం అయ్యేవి కావ‌న్న వాద‌న కూడా ఉంది.

Recommended For You

Comments are closed.