జ‌గ‌న్‌కు మోడీ పిలుపు వెన‌క విష‌యం అదేనా?

ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అర‌గంట‌కు పైగా స‌మ‌యం కేటాయించారు. గ‌తంలో చాలాసార్లు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా అనుమాన‌మే అనుకుంటున్న స‌మ‌యంలో పిఎంఓ నుంచే పిలుపు వ‌చ్చింది.  ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే ఇందుకు కార‌ణం అంటున్నారు. చంద్ర‌బాబు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోందట‌. చంద్ర‌బాబు స‌ర్వేల్లోనే ఇది బ‌య‌ట‌ప‌డిందంటున్నారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే.. కేంద్రం నివేదిక‌లు కూడా బాబుకు త‌గ్గ‌తున్న ఆద‌ర‌ణ‌కు అద్దం ప‌డుతున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలంటున్నాయి. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే టీడీపీకి పెద్ద మైన‌స్ అవుతుందని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ఇవ‌న్నీ వైసీపీకి ప్లస్ అయ్యే అవ‌కాశముందని అంటున్నారు. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్‌ను కూడా ద‌గ్గ‌ర‌కు తీసుకుంటే భ‌విష్య‌త్తులో ఉప‌యోగ‌ప‌డ‌తాడ‌న్న అభిప్రాయం క‌మ‌ల‌నాధుల్లో ఉంద‌ట‌. అందుకే మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అమిత్‌షా వ్యూహంలో భాగంగానే ఏపీలో మొత్తం సీను మారుతుంద‌ని చెబుతున్నారు. అలాగ‌ని తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోకుండానే.. జ‌గ‌న్‌తో దోస్తీకి సిద్ద‌మైపోయింది బీజేపీ. జ‌గ‌న్‌కు హ‌స్తిన‌లో స‌పోర్టు దొరికిన‌ట్టే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు ఇందులో ఎంత నిజ‌మెందో…2019లో తేల‌నుంది. !

Recommended For You

Comments are closed.