చిల్ల‌ర కొట్లు చిత్తు.. మాల్స్ ఫుల్‌…!

మోడీ నిర్ణ‌యం చిల్ల‌ర‌కోట్ల‌కు చిక్కులు తెచ్చాయి. జ‌నాల చేతిలో చిల్ల‌ర లేక‌పోవ‌డంతో దుకాణం ముఖం చూడ‌టం లేదు. కూర‌గాయ‌ల‌కు కూడా మార్కెట్‌ల‌కు రావ‌డం మానేశారు. కార్డులు ప‌ట్టుకుని అంతా మాల్స్‌కు ప‌రుగులు తీస్తున్నారు. సూప‌ర్‌మార్కెట్లు కిట‌కిట‌లాడుతున్నాయి. చిల్ల‌ర దుకాణాలు, రైతు బ‌జార్ల‌లో అమ్మ‌కాలు త‌గ్గాయి. మాల్స్‌లో అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. గ‌డిచిన నెల రోజుల్లో బిగ్‌బ‌జార్‌, రిలయ‌న్స్ ఫ్రెష్‌, హ‌రిటేజ్, మోర్‌, స్పార్‌, హైప‌ర్‌మార్కెట్‌ల‌లో అమ్మ‌కాలు 40శాతం పెరిగాయ‌ట‌. కార్పోరేట్ కంపెనీలు ఫుల్ ఖుషీగా ఉన్నాయ‌ట‌. వీకెండ్ అయితే మాల్స్ అస‌లు ఖాళీ ఉండ‌డం లేదు. మార్కెట్లు మాత్రం వెల‌వెల‌బోతున్నాయి. మ‌రి మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో ఎవ‌రు రోడ్డున ప‌డుతున్నారు. అలా అని మధ్యతరగతి కొనుగోలుదారులు హ్యాపీగా లేరు. మాల్స్ వెళితే అవసరం ఉన్నవే కాదు.. లేకపోయినా కొనాల్సి వస్తుందని.. ఇదెక్కడి గొలరా అంటూ కలత చెందుతున్నారు. పేద‌ల సాధిక‌రిక‌త కోస‌మే నోట్లు ర‌ద్దు అన్న మోడీ దీనికి స‌మాధానం చెబుతారా? ఆ పేద వ్యాపారులు ఇప్ప‌ట్లో కోలుకుంటారా.?

Recommended For You

Comments are closed.