ఆ పేద ఎమ్మెల్సీ ఆస్తులు వెయ్యి కోట్ల పైమాటే…!

య‌న పేరు మోసిన రాజ‌కీయ నాయ‌కుడు. ప‌దేళ్లుకు పైగా మంత్రిగా ప‌ద‌వి అనుభ‌వించారు. పార్టీకి అధికారం లేన‌ప్పుడు కూడా అంటిపెట్టుకుని త‌న ప‌దునైన నోటితో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టేవారు. అలాంటి నాయ‌కుడికి పార్టీలో నిజాయితీప‌రుడు అనే పేరుంది. ఇంత‌కాలం ప‌ద‌వులు అనుభ‌వించినా హైద‌రాబాద్‌లో సొంత ఇల్లు లేదు. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న ఆస్తి వెయ్యి కోట్లుగా మారింది. అవును ఆయ‌న ఎవ‌రో కాదు.. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. సోమిరెడ్డికి హైద‌రాబాద్‌లో ఇల్లు లేదు కానీ.. దేశ విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయ‌ట‌. ఇది ఈడీనో.. ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులో చెప్పింది కాదు.. ప్ర‌తిప‌క్షానికి చెందిన స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి అంటున్న మాట‌. సింగ‌పూర్‌లో విల‌స‌వంత‌మైన ర‌ఫ్‌లెస్ టౌన్‌షిప్‌లో సోమిరెడ్డికి స‌భ్య‌త్వం కూడా ఉంది చూడండి అంటూ డాక్యుమెంట్లు చూపించారు. ప్ర‌జ‌ల్లో పేదోడిగా ఫోజులు కొడుతూ విదేశాల్లో కోట్లు పోగేశార‌ని ఆరోపించారు. హాంకాంగ్‌, మ‌లేసియా దేశాల్లో కూడా ఆస్తులున్నాయ‌ట‌. వీటికి సంబంధించిన ఆధారాల‌ను కేంద్రానికి, ఆర్ధిక శాఖ‌కు అందిస్తాన‌ని అంటున్నారు. ఇదే విష‌యం సోమిరెడ్డిని అడిగితే.. అన్ని ఆస్తులా.. ఉంటే అప్ప‌గించండి అనుభ‌విస్తాను అంటున్నారు. ఉండ‌టానికి ఇల్లే లేదు. విదేశాల్లో విలాసాలా అంటున్నారు. విచార‌ణ జ‌రిపించి నా పేరుతో ఇస్తులు ఉంటే తీసుకోండి అంటున్నారు. మొత్తానికి సింహ‌పురి నేత‌ల మ‌ధ్య స‌వాళ్లు భ‌లే కాస్టిలీగా ఉన్నాయి.

Recommended For You

Comments are closed.