క్రెటాకు పోటీగా బ్రిటన్ కు చెందిన ఎంజీ హెక్టార్ కార్

బ్రిటన్‌ కు చెందిన వాహన దిగ్గజం మోరిస్‌ గ్యారేజ్‌ కంపెనీకి చెందిన తొలికారు  భారత్‌ లో అడుగుపెట్టింది. దేశంలో మిడ్‌ సెగ్మంట్‌ ఎస్‌.యు.వి.లకు పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఎంజీ కంపెనీ స్పోర్ట్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెక్టార్‌ పేరుతో కారును దేశీయంగానే అసెంబ్లింగ్‌ చేస్తోంది. 2.0 లీటర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ తో తయారైంది. లేటెస్ట్‌ సేఫ్టీ టెక్నాలజీతో అధ్బుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టెస్ట్‌ డ్రైవ్‌ పూర్తి చేసిన కారు.. రోడ్డుమీదకు వస్తోంది. 360 డిగ్రీల పనోరమిక్‌ సెన్సార్స్‌, చుట్టూ పార్కింగ్‌ కెమెరాలు ఇందులో ఉన్నాయి. 10.4 ఇంచుల ఇన్‌ ఫోటైన్‌ మెంట్‌ టచ్‌ స్ర్కీన్‌ ఉంటుంది. అత్యాధునిక భద్రతా వ్యవస్థ, యాపిల్‌, యాండ్రాయిడ్‌ సపోర్ట్‌, సెన్సర్స్‌, ఎమెర్జెన్సీ ఫీచర్స్‌ ఉన్నాయి. రెండు మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీని ధర 15లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంజీ హెక్టార్‌ ఖచ్చితంగా హుండాయ్‌ క్రెటా, వెన్యూ, మహీంద్రా XUV500, టక్సన్‌, టాటా హరియర్‌, జీప్‌, నిస్సాన్‌ కిక్స్‌ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారత మార్కెట్లో స్పోర్ట్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది అందుకే ముందుగా హెక్టార్‌ ను విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. క్రెటా విడుదల అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా వెయిటింగ్‌ పెరియడ్‌ కొనసాగుతోంది. అమ్మకాలు పెరుగుతున్నాయి. మహీంద్రా XUV సేల్స్‌ పెరగడం, టాటా హారియర్‌ వంటి వాటితో రావడం వంటివి ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ కు అద్దం పడుతున్నాయి. అందుకే బ్రిటన్‌ కంపెనీ మోరిస్‌ గ్యారేజ్‌ కూడా హెక్టార్‌ తో భారత్‌లో అడుగుపెట్టింది. మొత్తానికి భారతదేశ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ కంపెనీ ఎ స్థాయిలో అమ్మకాలు సాగిస్తుందో చూడాలి. ఇప్పటికీ చాలాకంపెనీలు ఈ విభాగంలో ఉన్నా.. సర్వీస్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. మారుతీ, హ్యూండాయ్‌ మినహా కొన్ని కంపెనీల నెట్‌ వర్కు లేక అమ్మకాల్లో వెనకబడుతున్నాయి. మరి ఎంజీ మోటార్స్‌ నెట్‌ వర్క్‌ లోపాలను ఎలా అధిగమిస్తుందన్నది చూడాలి. ఫియెట్‌ కంపెనీ జీప్‌ కార్లను కేవలం నగరాలకే పరిమితం చేసింది. మోడల్‌ ఆకట్టుకుంటున్నా.. ఆశించిన స్థాయిలో వృద్ది నమోదు చేయకపోవడానికి కారణం సర్వీస్‌ నెట్‌ వర్కు లోపం.  మరి జీఎం కారు ఎలా మార్కెట్లో నిలదొక్కుకుంటున్నది తెలియాలి. కారు మోడల్‌, ఫీచర్స్‌ బాగున్నాయి. కస్టమర్ల టేస్ట్‌ మారిందని…ఫీచర్స్‌ ఉంటే ఆదరిస్తారని… సర్వీస్‌ కూడా మెరుగ్గా ఉంటుందని కంపెనీ వర్గాలంటున్నాయ. దేశీయంగా తయరుచేయడం వల్ల స్పేర్‌ పార్టుల సమస్యల తలెత్తవని.. సర్వీస్‌ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. నిర్వహణ వ్యయం పోటీ కంపెనీలతో పోల్చుకుంటే అందుబాటులో ఉంటుందని.. అంటోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న మోరిస్‌ గ్యారేజ్‌ కారు భారతీయ రోడ్లపై ఎలా హల్‌ చల్‌ చేస్తుందో.. ఇటీవల హైదరాబాద్‌ లోని ఇనార్బిట్‌ మాల్‌ లో  పెట్టిన ఎంజీ షోకు మాత్రం రెస్పాన్స్‌ అదిరిపోయింది.. సేల్స్‌లో కూడా దుమ్ము రేపుతాయా? చూడాలి.
Watch Video:

Recommended For You