ఎంజీ కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కారుకే 5లక్షలు ధర ఎక్కువ

ఎంజీ హెక్టార్‌ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. భారత్‌ లో విడుదల అయిన కొద్దిరోజుల్లోనే బుకింగ్స్‌ అదిరిపోయాయి. కారుకు వెయిటింగ్‌ పీరియడ్‌ కూడా దాదాపు ఆరు నెలలుగా ఉంది. ఈ బ్రిటిష్‌ కంపెనీ కస్టమర్ల డిమాండ్‌ కు తగ్గట్టు సరఫరా చేయలేకపోతుంది. అయితే వారిని నిరాశపరచకుండా వెయిటింగ్‌ పిరియడ్‌ లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఇస్తోంది. వారి మనసు చూరగొంటోంది. ఇది జరుగుతుండగానే… డిమాండ్‌ ను కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఎంజీ హెక్టార్‌ కు ఉన్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే డెలివరీ తీసుకున్న కస్టమర్ల రీసేల్‌ కు పెట్టడం విశేషం. ఆటో సైట్‌ DROOM లో పంజాబ్‌ లోని లుథియానాకు చెందిన ఓ కస్టమర్‌ తన కారును అమ్మకానికి పెట్టాడు. ఎంజీ హై ఎండ్‌ కారు సూపర్‌ ఎడిషన్‌ 2.0 లీటర్‌ డీజిల్‌ కారు ఇది. వాస్తవానికి దీని ఖరీదు ఎక్స్‌ షోరూమ్‌ 14లక్షల 18లక్షలుగా ఉంది. అన్ని పన్నులు, ఇతర రిజిస్ట్రేషన్‌, రోడ్‌ ట్యాక్స్ లు అన్నీ కలిపి 16.5 లక్షలవుతుంది. అయితే దీనిని ఏకంగా కస్టమర్‌ 21 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. అంటే కొత్త కారు ధర కంటే 5లక్షలు ఎక్కువన్నమాట.. సోషల్‌ మీడియాలో ఈ యాడ్‌ ఇప్పుడు వైరల్‌ గా మారుతోంది. ఎంజీ కారుకు ఉన్న డిమాండ్‌ ఇదని.. కొందరంటే… కంపెనీ ఇబ్బందుల్లో పడుతుందని మరికొందరు అంటున్నారు. ఏమైనా కొత్త కారు కంటే… సెకండ్‌ హ్యాండ్‌ కారు 5లక్షలు అధిక ధరకు అమ్మడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా అయి నెంబర్‌ ప్లేట్‌ వచ్చిన ఈ కారును కస్టమర్‌ అమ్మడానికి కారణాలు తెలియదు కానీ… డిమాండ్‌ ను సొమ్ము చేసుకునే ఎత్తుగడ అంటున్నారు. కేవలం 13వందల కిలోమీటర్లు మాత్రమే తన కారు తిరిగిందని…యాడ్‌ లో ప్రకటించారు. అన్ని ఫీచర్స్‌, లేటెస్ట్‌ ఎక్విప్‌ మెంట్‌తో ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే తనకు నచ్చిన విధంగా కొన్ని మార్పులు చేసి కూడా ఉండవచ్చు. అందుకే ధర పెరిగి ఉంటుందని కూడా కొందరంటున్నారు. అయితే కస్టమర్‌ డిటైల్స్‌ మాత్రం ఇవ్వలేదు. మొత్తానికి ఎంజీ కంపెనీకి కూడా ఈ వార్త షాకింగ్‌ అంటున్నారు ఆటో రంగ నిపుణులు.

Recommended For You