లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారా?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారా? ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలు… మంగళగిరి ఓటమి నేపథ్యంలో .. తనను తాను నిరూపించుకోవడానికి సిద్దమవుతున్నారు. తెరవెనక పార్టీని నడిపించడంలో పదేళ్లుగా శ్రమపడుతూ.. విజయం సాధించినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. స్వయంగా మంగళగిరి నుంచి పోటీచేసినా.. అక్కడి ఓటర్లను మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో రాటదేలడంతో పాటు.. ప్రత్యర్ధులపై పైచేయి సాధించాలంటే… ముందు క్షేత్రస్థాయిలో రాజకీయాలపై అవగాహన ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పాదయాత్ర మంచి ఆప్షన్‌ అని సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తోంది. అయితే నిర్ణయం తీసుకోకపోయినా.. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందని అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్టీ నాయకత్వ వ్యవహారాలు చంద్రబాబు చూసుకుంటున్నారు. ఈ సమయంలో పాదయాత్ర చేస్తే వ్యక్తిగతంగా తనకు అనుభవం.. జనాల్లో ఇమేజ్‌ వస్తుందని నమ్ముతున్నారు. అయితే యాత్ర ఎప్పుడు చేస్తే భాగుంటుందన్న చర్చ కూడా జరిగిందిట.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమిలి ఎన్నికలు అంటున్నారు.. వస్తే 2022లోనే ఎన్నికలు రావొచ్చని సంకేతాలున్నాయి. అందుకే వచ్చే ఏడాది చివరలో పాదయాత్ర మొదలుపెడితే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పాదయాత్ర చేస్తే జగన్ ను అనుసరించారని విమర్శలు వస్తాయని వాటిని సమాధానం కూడా సిద్దం చేయాలని చెబుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు చేసిన మీకోసం యాత్ర పేరునే కంటిన్యూ చేస్తూ… జనాల్లోకి వెళ్లాలని చూస్తున్నారట. స్పష్టమైన హామీలతో జనాలకు దగ్గరయ్యేందుకు.. సాధ్యమైనంత ఎక్కువ సమావేశాలు ఉండేలా యాత్ర ఉంటుందని తెలుస్తోంది. అసలు లోకేష్‌ పాదయాత్ర అనే ప్రస్తావనే లేదని… ఆయన దీనిపై ఎప్పుడూ ఎవరితోనూ చర్చించలేదని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తానికి లీకులు మాత్రం వచ్చాయి. ఇందులో నిజమెంతో కానీ.. లోకేష్‌ యాత్ర చేస్తే మాత్రం జనాలకు చేరువ కావడం ఖాయమంటున్నారు. పైగా పార్టీలో యువత అధికంగా ఉంది… యువనాయకులు ఉత్సాహంగా ఉన్నారు. వారంతా కలిసి జనాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని కేడర్‌ కోరుకుంటోంది.. అదే సమయంలో యువనాయకత్వాన్ని.. కొత్తతరాన్ని అందించినట్టు అవుతుందని చెబుతున్నారు. మరి అధినేత చంద్రబాబు మనసులో ఏముందో చూడాలి. భావిస్తున్నారట. పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళితే… సమస్యలు తెలుస్తాయి.. కేడర్‌ మనసులో మాట తెలుస్తుంది

Recommended For You