ప‌వ‌న్ ప్రాప‌కం కోసం నేత‌ల‌ పాట్లు..!

పవన్ కోసం పాట్లు
పవన్ కోసం పాట్లు
పవ‌న్ క‌ళ్యాణ్.. నాకు కులం లేదు.. మ‌తం లేదు అని ప‌దేప‌దే చెబుతున్నారు. త‌న ల‌క్ష్యం స‌మ స‌మాజం అంటున్నారు. ఇప్పుడు పోరాటం ప్ర‌త్యేక హోదా కోస‌మ‌ని నిన‌దిస్తున్నారు. కానీ ఆయ‌న్ను నాయ‌కులు కొందరు కులమనే రొంపిలోకి లాగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా యూత్ ఫోలోయింగ్ ఉన్న ప‌వ‌ర్‌స్టార్‌కు కూడా త‌మ కుల ముద్ర వేయాల‌ని కుట్ర‌లు చేస్తున్నారు. గ‌తంలో చిరంజీవి కూడా ఈ ముద్ర‌లో చిక్కుకుని… పార్టీని ప‌ణంగా పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు ప‌వ‌న్ చుట్టూ మూగాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు. కులం కంటే ముందు ఆయ‌న‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌వ‌న్‌కు ద‌గ్గర అయితే రాజ‌కీయంగా వేగంగా ప‌ద‌వులు అందుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న వారికి ఉండ‌వ‌చ్చు. కులానికి ప్ర‌తినిధిగా ఎద‌గ‌వ‌చ్చ‌న్న భావ‌న వారిలో ఉందంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ ప్రాపకం కోసం పాటు ప‌డుతున్న వారిలో అధికార పార్టీ నాయ‌కులు ఉండ‌డం విశేషం.

ఇటీవ‌ల కాలంలో తెలుగుదేశానికి చెందిన ప‌లువురు నాయ‌కులు కుల రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి చూపుతున్నారు. అంతే కాదు.. ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టిన వ‌ప‌న్ క‌ళ్యాణ్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇద్ద‌రైతే ముందే క‌ర్చీప్ వేయాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కనిపిస్తోంది. ఒక‌రు విజ‌య‌వాడ‌కు చెందిన బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అయితే… మ‌రొక‌రు తోట న‌ర్సింహం. 
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను విమ‌ర్శించినందుకు టీజీ వెంక‌టేశ్‌పై బోండా విరుచుక‌ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆయ‌న తీరు చూసి పార్టీ నేత‌లే విస్తుపోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ ఎంపీల‌ను, పార్టీల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. దీనిపై టీజీ స‌హా కేశినేని నానీ ప‌లువురు ఎదురుదాడి చేశారు. ఇందుకు భిన్నంగా బోండా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి సొంత పార్టీ నేత‌ల‌కే నీతులు చెప్పారు. బోండా జ‌న‌సేన‌లో క‌ర్చీప్ వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే పవన్ పట్ల ప్రేమను కురిపిస్తున్నారట . విజయ‌వాడ‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి నేత‌గా ఎద‌గాల‌నుకుంటున్న ఆయ‌న టీడీపీలో క‌ష్ట‌మ‌ని భావిస్తున్నారు. ఇటీవల చేరిన నెహ్రూ స‌హా దేవినేని కుటుంబం అంతా అక్క‌డే ఉంది. ఇక కేశినేని నాని, గ‌ద్దె, బోడే ప్ర‌సాద్‌ వంటి క‌మ్మ వ‌ర్గం వాళ్లు పాగా వేశారు. త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన బోండా జ‌న‌సేన‌ ద్వారా తమ సామాజికవ‌ర్గానికి నేత‌గా ఎద‌గాల‌నుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప‌వ‌న్ పుట్టిన రోజు వేడుకులు కూడా త‌న అనుచ‌రుల చేత ఘ‌నంగా నిర్వ‌హించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో కూడా ఎంపీ తోట న‌ర్సింహం కూడా జ‌న‌సేనలో క‌ర్చీప్ వేస్తున్నారట. త‌న సమీప బంధువుల పేరుతో ప‌వ‌ర్ స్టార్ కాకినాడ స‌భ‌కు భారీగా ప్లెక్సీలు క‌ట్టించారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి పవన్ తిరుపతిలో ఎంపీలనే టార్గెట చేశారు. అయినా అభిమానం ముసుగులో తోట న‌ర్సింహం పవన్ కు దగ్గర అయ్యేందుకు ప‌క్కాగా స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల జిల్లాలో తోట‌కు కాస్త ఇబ్బందిగా మారింది. జ్యోతుల నెహ్రూ వంటి నాయ‌కులు రావ‌డంతో త‌న‌కు పార్టీలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ముందుగానే భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.  
మొత్తానికి కులం వ‌ద్ద‌రా బాబూ అంటున్నా… ప‌వ‌న్‌న‌ను మాత్రం వెంటాడుతున్నారు. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌న్న‌ది చూడాలి.

Recommended For You

Comments are closed.