ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా.. అని సేద తీరుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం ఎన్నికల ఖర్చులు పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాలతో విహారయాత్రలకు చెక్కేశారు. చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫలితాలు వచ్చిన తర్వాత గెలిస్తే కార్యకర్తల హడావిడితో క్షణం తీరిక ఉండదు.. విజయోత్సవాలతో బిజీ.. ఓడిపోతే ిఓదార్పు యాత్రలు తప్పవు.. అందుకు ఫలితాలు రాకముందే కుటుంబంతో కాస్త సరదాగా గడిపినట్టు ఉంటుందని.. అంతా సర్దుకున్నారు. ఇందులో ముందువరసలో ఉన్నారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికలు అయిన వారంలోపే ఆయన స్విస్ వెళ్లారు. స్విట్జర్లాండ్ లో కుటుంబంతో సహా మంచుకొండల్లో సేద తీరుతున్నారు. అటు వైసీపీ నాయకురాలు రోజా సైతం విదేశాలకు( యూరోప్ అనుకుంటా)వెళ్లారు. తాజాగా చంద్రబాబునాయుడు సైతం హిమాచల్ ప్రదేశ్ లో సేద తీరుతున్నారు. మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక తెలంగాణకు చెందిన కొందరు నాయకులు కూడా విదేశీ, స్వేదేశీ పర్యటనల్లో ఉన్నారు.రేవంత్ రెడ్డి కాశ్మీర్ లోయల్లో సేద తీరుతున్నారు. ఏసీ కారుల్లో తిరిగే నాయకులు ప్రచారంలో ఎండదెబ్బకు మాడిపోయారు.. తిరిగి రిఫ్రెష్ అయి.. వస్తారట.

Recommended For You