రిటైర్మెంట్ అనుకున్నారు.. అనూహ్యంగా పోటీలోకి వచ్చారు

రాజకీయాలలో అత్యంత కీలకపాత్ర పోషించిన కొందరు నాయకులు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేది లేదని చెప్పారు. కానీ అనూహ్యంగా మళ్లీ రేసులో నిలబడాల్సి వచ్చింది. ఇదే విది అంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడల్లుడు, ఎన్టీఆర్‌ కు పెద్దల్లుడుగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈసారి అనివార్య పరిస్థితుల్లో పోటీలోకి దిగారు.  పర్చూరు నుంచి ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌కు సీటు ఇప్పించాలనుకున్నారు. భార్య బీజేపీలో ఉన్నా.. కొడుకు కోసం ఆయన వైసీపీలో చేరారు. అయితే హితేష్‌కు భారత పౌరసత్వం కేటాయింపు ఆలస్యం కావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలో దిగారు. ఒకవేళ దగ్గుబాటి గెలుపొందినా తిరిగి రాజీనామా చేసి కుమారుడు హితేష్‌ను పర్చూరు నుంచి పోటీచేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  జగన్‌ మాత్రం ఇందుకు భిన్నంగా అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పదవి ఇచ్చి చంద్రబాబును ఇరుకున పెట్టాలని భావిస్తున్నారట. ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉండాలనుకున్న దగ్గుపాట ఇలా పోటీలో దిగడం విశేషం. టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం కూడా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు. ఆయన వారసుడ వెంకటేశ్‌ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి చాలనుకున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలోకి వెళ్లిపోవడంతో కరణం నేరుగా రంగంలో దిగక తప్పలేదు. పోటీ చేయటమే కాదు….ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టించారు. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి బలరాం చీరాల నుంచీ గెలుపొందితే కీలక పదవి చేపట్టే అవకాశం ఉంది. ఆయన సీనియార్టీ కారణంగా మళ్లీ క్రియాశీలకంగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి. అలాగే 2014 ఎన్నికల్లో వ్యూహత్మకంగానే పోటీకీ దూరంగా ఉన్న మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌ రెడ్డి ఈఎన్నికల్లో కందుకూరు నియోజక వర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షీంచుకోనున్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి. జిల్లా మంత్రిగా మంచిపేరు సంపాదించారు. మరి ఆయనకు ప్రజలు పట్టం కడతారో… రాజకీయంగా శాశ్వతంగా ఇంటికి పంపుతారో చూడాలి. ఇక  చాలా కాలంగా పోటీకీ దూరంగా ఉన్న బాచిన చెంచు గరటయ్యకు కూడా ఈఎన్నికల్లో తలపడ్డారు. వైసీపీ తరపున అద్దంకి నియోజకవర్గం నుంచీ పోటీ చేసిన గరటయ్య తన అదృష్ఠాన్ని పరీక్షీంచుకుంటున్నారు. కుమారుడు కృష్ణ చైతన్యను రంగంలోకీ దించాలనీ గరటయ్య ప్రయత్నించినప్పటీకీ, అధిష్ఠానం మాత్రం గరటయ్యకే ప్రయార్టీ ఇచ్చింది.  మొత్తంమీద ప్రతి ఎన్నికల్లోనూ కొత్తకొత్త నాయకత్వాలు తెరమీదకు రావటం సాధారణం. కానీ రిటైర్మంట్‌ తీసుకుందామని బావించిన నేతలు… అనూహ్య పరిస్థితుల్లో పోటీలో ఉండడం విశేషం.

Watch Video

Recommended For You