ఆమె చ‌దివింది ఎంబిఏ.. చేసేది డ్ర‌గ్స్ దందా…!

26 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రురాలు.. ఉన్న‌త ఉద్యోగంలో స్థిర‌ప‌డాల్సిన ఈ యువ‌తి అడ్డ‌దారుల్లో డ్ర‌గ్ మాఫియా రాణిగా మారాల‌నుకుంది. దేశ విదేశాల‌కు ఒపియ‌మ్ వంటి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తూ అడ్డంగా బుక్ అయింది. ది నార్క‌టిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ విభాగానికి ఇటీవ‌ల  ప‌క్కా స‌మాచారం అందింది. కెన‌డాకు డ్ర‌గ్స్ ఉన్న పార్సిల్ వెళుతున్న‌ట్టు రెండు రోజుల క్రితం తెలిసింది. వెళ్లి చెక్ చేయ‌గా స‌మాచారం నిజ‌మే అని తేలింది. ఎవ‌రు పంపారో పోలీసులు తెలుసుకోలేక‌పోయారు. దీనిపై చెన్నై అడ్ర‌స్ ఉంది. అయితే అది త‌ప్పుడు ఆధారాల‌తో కొరియ‌ర్ చేసిన‌ట్టు తేలిపోయింది. త‌ర్వాత మ‌రోరోజు సేమ్ క‌వ‌ర్‌లో మ‌రో కొరియ‌ర్ సంస్థ‌కు పార్శిల్ వ‌చ్చింది. ద‌ర్యాప్తు చేసిన నార్కొటిక్స్ ఎట్టికేల‌కు కేసును ఛేదించారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తుంది ఓ యువ‌తి అని తెలుసుకుని నివ్వెర‌పోయారు. 26 ఏళ్ల వ‌య‌సున్న ఆమె.. చాల‌కాలంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ట‌. ద‌ర్యాప్తులో విస్తుగొలిపే అంశాలెన్నొ చెప్పింద‌ట‌. మాఫియా డాన్ గా మారే ఆలోచ‌న‌ ఉందట. కానీ స‌మ‌యం ఆమెకు క‌లిసిరాలేదు. పోలీసుల‌కు చిక్కింది. చ‌దివిన చ‌ద‌వుకు మంచి ఉద్యోగం వ‌స్తుంద‌ని తెలిసినా అడ్డ‌దారుల్లో వెళ్లాల‌నుకుని అడ్డంగా బుక్క‌యింది.

Recommended For You

Comments are closed.