కేటీఆర్‌కు అవిశ్వాసాల సెగ తాకుతుందా?

తెలంగాణ‌లో ఇప్పుడు అవిశ్వాసం సీజ‌న్ న‌డుస్తోంది. పుర‌పాల‌క సంఘాలు ఏర్ప‌డి నాలుగేళ్లు అవుతుండ‌డంతో మేయ‌ర్ల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఒక్క‌సారిగా కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు బ‌య‌ట‌పెడుతున్నారు. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధ్య చ‌ట్టం ప్ర‌కారం లోక‌ల్ బాడీస్ లో నాలుగేళ్ల వ‌ర‌కూ అవిశ్వాసం పెట్ట‌డానికి వీల్లేదు. దీంతో ఇంత‌కాలం వేచి ఉన్న స‌భ్యులు ఇప్పుడు అవిశ్వాసం అస్త్రాన్ని వ‌దులుతున్నారు. అధికార‌పార్టీకి ఇది మింగుడుప‌డ‌డ‌ని అంశంగా మారింది. త‌మ‌కు ప‌క్క‌లో బ‌ల్లెంగా మారిన మేయ‌ర్లు, మున్సిప‌ల్ ఛైర్మ‌న్లుపై ఎమ్మెల్యేలు ప‌గ తీర్చుకోవ‌డానికి కూడా ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో అవిశ్వాసం క‌ల‌క‌లం రేపుతోంది. సాక్షాత్త్తూ కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లాలోని సిరిసిల్ల‌, వేముల‌వాడ‌కు కూడా త‌ప్ప‌డం లేదు. అయితే ఆయ‌న జిల్లా మాత్ర‌మే కాదు.. రాష్ట్రం మొత్తంలో క‌ల‌క‌లం రేపుతున్న అవిశ్వాసం వ్య‌వ‌హారాలు కేటీఆర్ కు ఇబ్బందిగానే మారాయి. పుర‌పాల‌క శాఖ‌మంత్రిగా ఉన్న ఆయ‌నపై స‌ర్దుబాటు చేసే బాధ్య‌త ఉంది. ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. ముంద‌స్తు అన్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో వ‌ర్గ‌పోరు ఎక్క‌డ పార్టీకి ఇబ్బందిగా మారుతుందోన‌న్న ఆందోళ‌న ఉంది. మ‌రి కేటీఆర్ వీటిపై దృష్టి పెట్టి వెంట‌నే స‌ర్దుబాటు చేయ‌క‌పోతే పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతుంది.

Recommended For You