త్వరలోనే సీఎం కానున్న కేటీఆర్..!

కేటీఆర్ సీఎంగా  బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయదుందబి ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు పోటీ ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇక  జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా స్వీప్ లక్ష్యంగా ఇప్పటికే రంగం సిద్దం చేసింది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కేంద్రంలో మే 23 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అక్కడ థర్డ్ ఫ్రంట్ వచ్చినా.. జాతీయ పార్టీలకు మెజార్టీ తగ్గినా.. టిఆర్ఎస్ కీలకంగా మారే అవకాశం  ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మంత్రివర్గంలో కేసీఆర్ చేరే అవకాశం ఉంది. ఒక వేళ కేబినెట్ లో చేరకపోయినా.. కవితకు అవకాశం ఇచ్చి ఆయన రాష్ట్రం, కేంద్రంలో చక్రం తిప్పుతూ పార్టీ అధ్యక్ష పదవికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. పదవుల పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపని కేసీఆర్.. ఈ సారి మార్గదర్శకుడిగానే ఉండే అవకాశం  లేకపోలేదు.  అయితే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్డీయే కు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఆయన రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతారు. ఎందుకంటే మోడీ పీఎం అయితే ఇతర మంత్రులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అదే యూపీఏ లేదా, థర్డ్ ఫ్రంట్ వస్తే మాత్రం కేంద్రంలో కీలక పదవి చేపట్టే అవకాశం ఉంది. ఆయన ఆలోచనలు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పాలసీ మేకర్ గా తన మార్కు చూపించడానికి ఓ అవకాశం దక్కుతుంది. మొత్తానికి కేసీఆర్  కేటీఆర్ ల భవిష్యత్తు నిర్ణయాలు  సార్వత్రిక  ఎన్నికలపై ఆధారపడి ఉన్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. వెళ్లకపోయినా కేటీఆర్ మాత్రం సీఎం ఖాయమంటున్నాయి గులాబీ వర్గాలు.

Recommended For You