ఇష్టం లేకపోతే వెళ్లిపోండి: కేటీఆర్

తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది. నా వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాలు, కార్య‌క్ర‌మాలు కూడా మీరే శాసిస్తారా? అంటూ మండిప‌డ్డారు. అస‌లు విష‌యం ఏంటంటే.. స్వ‌త‌హాగా సినిమాల‌ను ఇష్ట‌ప‌డే కేటీఆర్.. మంత్రిగా కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నా.. ఇటీవ‌ల విడుద‌లైన వ‌రుణ్ తేజ్ న‌టించిన‌ తొలిప్రేమ సినిమాను చూశారు. సినిమా అధ్బుతంగా ఉంద‌ని కొనియాడారు. న‌టుల‌ను, ద‌ర్శ‌కుడ్ని, సంగీత ద‌ర్శ‌కుడ్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. దీనిపై కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. మంత్రిగా ఉండి. సినిమాలు చూడ‌డం ఏంటన్న విధంగా స్పందించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కేటీఆర్ గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చారు. బాధ్య‌త క‌లిగిన మంత్రిగా ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నేను సినిమా చూస్తే మీకేంటి.. నా కార్య‌క్ర‌మం మార్చుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి.. నేను ప్ర‌జాజీవితంలో ఉండి ఉండొచ్చు. అంత‌మాత్రానికే నాకు ఇష్టాయిష్టాలుండ‌వా? అంటూ ప్ర‌శ్నించారు. అంతే కాదు.. నీకు ఇష్టం లేక‌పోతే నా ట్విట్ట‌ర్ ఖాతా ఫాలో కాకంటూ చుర‌క వేశారు. కొస‌మెరుపు ఎంటంటే.. అన్న కేటీఆర్ స‌మాధానానికి చెల్లెలు క‌వితతో పాటు.. వేలాది మంది నెటిజన్లు మ‌ద్ద‌తుగా నిలిచారు. కాక‌పోతే ఎంటండీ.. మంత్రి అయినంత మాత్రాన సినిమా చూడ‌కూడ‌దా? ప‌్ర‌జాజీవితంలో ఉంటే అన్నీ త్యాగం చేయాలా?

Recommended For You