కేటీఆర్ సిఎం అయితే హ‌రీష్‌రావు..?

న్నిక‌ల‌కు ముందే కేటీఆర్ సిఎం అవుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఊహాగానాలు స‌త్య‌దూరం కావొచ్చు కానీ.. ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వారు మాత్రం వార్త‌ల‌ను ఖండించడం లేదు. అలాగ‌ని స‌మ‌ర్ధించ‌డం లేదు. ఇప్ప‌టికే పాల‌నా ద‌క్ష‌డుగా నిరూపించుకున్న కేటీఆర్ సిఎం కావ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని స‌న్నిహితులు అంటున్నారు. వారి మాట‌ల వెన‌క అర్ధం ఎలా ఉన్నా.. కేసీఆర్ సిఎంగా ఉండాల‌ని కేటీఆర్ బ‌లంగా కోరుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఆలోచ‌న‌లు ఇందుకు భిన్నంగా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. తిరుగులేని ఆధిక్యం వ‌స్తుంద‌న్న సంకేతాలున్నాయి. దీంతో ముందుగానే కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. తాను జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు ప్ర‌చారముంది. దీని వెన‌క కార‌ణాలు కూడా విశ్లేషిస్తున్నారు.

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ఇటీవ‌ల రెండుమూడు సార్లు క‌లిసిన త‌ర్వాత కేసీఆర్‌లో మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. నోట్ల ర‌ద్దు అంశం త‌ర్వాత కేసీఆర్ ఇచ్చిన స‌ల‌హాలను మోడీ స్వ‌యంగా మెచ్చుకున్నారు. ప‌దేప‌దే స‌మావేశం అయిన త‌ర్వాత మ‌రిన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు అడిగి మ‌రీ నివేదిక‌లు తెప్పించుకున్నారు. తెలంగాణ‌లో అమ‌లు అవుతున్న ప‌థ‌కాలు, ఇత‌క కార్య‌క్ర‌మాలు అడిగి తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయారు. కేసీఆర్ పాల‌న ప‌ట్ల ఇప్ప‌టికే స‌ర్వేల ద్వారా తెలుసుకున్న మోడీ.. ఆయ‌న ప‌ట్ల సానుకూల దృక్ప‌థంగా ఉన్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌హ‌జంగానే సాన్నిహిత్యం పెరిగింద‌ట‌. పైగా కేసీఆర్ పెద్ద‌ల‌కు ఇచ్చే మ‌ర్యాద‌.. ఆయ‌న చూపించే ఆప్యాయ‌త మ‌రింత చేరువ చేసిందట‌. అలా ఓ సంద‌ర్భంలో కేంద్రానికి రావ‌చ్చుగా.. మీ అవ‌స‌రం ఉంద‌నిపిస్తుంది అని మోడీ సిఎం కేసీఆర్‌తో అన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో కీల‌క పాత్ర ఇవ్వ‌డానికి కూడా మోడీ రెడీగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో కేంద్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన పాత్ర పోషించ‌డానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎలాగూ కేటీఆర్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి సిద్దంగా ఉన్నారు. హ‌రీష్‌రావు కూడా మంత్రిగా నిరూపించుకున్నారు. కేటీఆర్‌కు స‌హ‌క‌రించ‌డానికి కేసీఆర్ మాన‌సికంగా సిద్దం చేసిన‌ట్టు తెలుస్తోంది. సో… కేటీఆర్ సిఎం అయినా హ‌రీష్‌రావు కూడా కేబినెట్లో ఉండ‌డం ఖాయం. బ‌య‌ట ప్ర‌చార‌మే కానీ కుటుంబంలో ఎలాంటి అనుమానాలు, అపోహ‌లు లేవంటున్నారు. అవ‌స‌ర‌మైతే క‌విత కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లో అన్న‌కు అండ‌గా కీల‌క పాత్ర పోషించ‌డానికి సిద్దంగా ఉన్నారట‌. సో… వీలైతే ఎన్నిక‌లకు మందు.. లేదంటే 2019లో అయినా కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారముంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో కానీ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే మాత్రం.. దేశ వ్యాప్తంగా మ‌న్న‌న‌లు అందుకోవ‌డం ఖాయమంటున్నారు అయ‌న స‌న్నిహితులు. మంచి వాగ్దాటే కాదు.. వ్యూహ‌క‌ర్త‌గా పేరుంది.. సిఎంగా స‌త్తా చాటుకున్నారు.. అక్క‌డ కూడా నిరూపించుకుంటారు. సందేహం లేదంటున్నారు.

Recommended For You

Comments are closed.