కొత్తగూడెం బాగుపడాలంటే..!

జిల్లాల పున‌ర్విభజనలో ఖమ్మం జిల్లాను రెండుగా విడదీశారు. దీంతో కొత్తగా ఏర్ప‌డిన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పారిశ్రామిక జిల్లాగా అవ‌త‌రించింది. సింగ‌రేణి గ‌నులు, ఐటీసీ భ‌ద్రాచలం, మ‌ణుగూరు హెవీవాట‌ర్ ప్లాంట్‌, కేటీపిఎస్‌, భ‌ద్రాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మ‌రే జిల్లాకు లేని ప్ర‌త్యేక‌త ఉంది. గ‌నులున్నాయి.. అట‌వీ సిరులున్నాయి. టెక్నాల‌జీ యూనివ‌ర్శిటీ రాబోతుంది. త్వ‌ర‌లో రాష్ట్రంలో హైద‌రాబాద్ త‌ర్వాత రెండో ఎయిర్‌పోర్టు కూడా వ‌స్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని ఉందని ఓ స‌మ‌స్య ప్ర‌ధాన స‌వాలుగా మారుతోంది. ఇంకా ఎంతో అభివృద్ధి జ‌ర‌గాల్సిన జిల్లాకు అడ్డంకిగా మారింది వ‌న్ ఆఫ్ సెవెన్టీ యాక్ట్‌.

గిరిజన చట్టమే జిల్లాకు శాపంగా మారుతోంది. ఇది కేవలం పారిశ్రామిక అభివృద్ధికి ఆటంక‌మే కాకుండా త‌ర‌చుగా ప్ర‌జ‌లు మ‌ధ్య చిచ్చుకు కార‌ణ‌మ‌వుతుంది. గిరిజ‌నుల‌కు, గిర‌జ‌నేత‌రుల‌కు మ‌ధ్య వివాదాల‌కు దారి తీస్తోంది. త‌న సొంత గ్రామంలో చిన్న వ్యాపారం పెట్టి యువ‌త‌కు ఉపాధి క‌ల్పాంచాల‌న్నా గిరిజ‌నేతరుల‌కు సాద్యం కావ‌డం లేదు. ప్ర‌భుత్వం రంగ సంస్థ‌లు త‌ప్ప‌.. మ‌రో ప‌రిశ్ర‌మ‌కు ఏర్పాటు అసాద్యం అవుతుంది. క‌నీసం జాగా తీసుకుని ఇల్లు క‌ట్టుకోవ‌డానికి కూడా కొత్త‌గూడెంలో అనుమ‌తి లేదు. మ‌రి అలాంట‌ప్పుడు జిల్లా కేంద్రం అయినా ఉప‌యోగం ఏంటన్న‌ది స్థానికుల వాద‌న‌. కొత్త‌గూడెంలో ఇప్ప‌టికీ జ‌రుగుతున్న వ్యాపారాలు చాలావ‌ర‌కు ఇల్లీగ‌లే. దేనికీ రిజిస్ట్రేష‌న్ ఉండ‌దు. కొత్త‌గూడెంలో ఎయిర్‌పోర్టు వ‌స్తుంది. టెక్నిక‌ల్ వ‌ర్శిటీ కూడా వ‌స్తోంది. స‌దుపాయాలు మెరుగుప‌డుతున్నాయి. ఇంకా ఉద్యోగులలు పెరగుతారు. ప‌ట్ట‌ణం కూడా విస్త‌రిస్తోంది. అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు కొత్త‌గూడెం న‌గ‌రంగా ఆవిర్భ‌వించాలంటే వ‌న్ ఆఫ్ సెవ‌న్టీపై ప్ర‌భుత్వం స‌మీక్షించాలి. క‌నీసం ప‌ట్ట‌ణానికి చుట్టూ 20 కిలోమీటర్లు వ‌ర‌కూ గిరిజ‌న చ‌ట్టాన్ని స‌డ‌లించారు. అప్పుడే వేగంగా వృద్ధి సాద్య‌మ‌వుతుంది. లేదంటే జిల్లా అయినా గిరిజ‌నేతురుల‌ ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌డం సాద్యం కాదు. ఇది జిల్లా అభివృద్ధిపైనా ప్ర‌భావం చూపుతుంది.

చ‌ట్టం స‌డ‌లించినంత‌మాత్రాన గిరిజనుల‌కు కూడా న‌ష్టం వాటిల్ల‌దు. వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌ల్లో, వ్యాపారాల్లో ఉపాధి అవ‌కాశాలు జిల్లాకే ద‌క్కుతాయి. రిజ‌ర్వేష‌న్ల‌తో వారి అవ‌కాశాల‌ను కొద‌వుండ‌దు. ప్రాంతం అభివృద్ధికి తూర్పున చంద్రుగుండ‌, ద‌క్ష‌ణాన జూలూరుపాడు, ఉత్త‌రాన పాల్వంచ‌, ప‌శ్చిమాన కిన్నెర‌సాని వ‌ర‌కూ చ‌ట్టాన్ని స‌వ‌రిస్తే కొత్త‌గూడెం రూపురేఖ‌లు మారిపోతాయి. అంతేకాదు రాష్ట్రంలో అత‌పెద్ద న‌గ‌రాల్లో ఒక‌టిగా వేగంగా వృద్ధి న‌మోదు చేస్తుంది. మ‌రి పాల‌కులు ఈ దిశ‌గా ఆలోచిస్తారా.. చూడాలి.

Recommended For You

Comments are closed.