లెగ‌సీ వ‌ర్సెస్ మ‌నీ.. కొత్త‌గూడెం టిఆర్ఎస్ లో ట‌గ్ ఆఫ్ వార్‌..!

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఉన్న అసెంబ్లీ జ‌న‌ర‌ల్ సీట్లే త‌క్కువ‌. ఖ‌మ్మం, కొత్త‌గూడెం, పాలేరు మాత్ర‌మే జ‌న‌ర‌ల్‌. మిగ‌తా 7 సీట్లు రిజ‌ర్వుడు స్థానాలు. జ‌న‌ర‌ల్ సీట్ల‌కు గ‌ట్టి పోటీనే న‌డుస్తోంది. నియోజ‌క‌వర్గాలు పెరుగుతాయ‌ని ఆశించారు. కానీ డి లిమిటేష‌న్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఉన్న మూడు సీట్ల‌లోనే స‌ర్దుబాటు అన్ని పార్టీల‌కు త‌ల‌పోటుగా మారింది. సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రికి వారు ఈ సారి అదృష్టం పరీక్షించుకోవ‌డానికి తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇక అధికార టిఆర్ ఎస్ లో అయితే పోటీ మ‌రీ ఎక్కువగా ఉంది. పాలేరులో ఇప్ప‌టికే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సెటిల్ అయ్యారు. ఖ‌మ్మంలో పువ్వాడ అజ‌య్ పాతుకుపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సిట్టింగు పైగా కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు. ఇక మిగిలింది కొత్త‌గూడెం.. ఈ సారి ఎమ్మెల్యే అయి.. మంత్రి కావాల‌న్న కోరిక‌తో ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ఇక్క‌డ విసృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అంతేకాదు.. కార్యాల‌యం పెట్టి మ‌రీ జ‌నాల‌కు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆయ‌న కొత్త‌గూడెం ఎమ్మెల్యేగా పోటీచేయ‌డం ఖాయమ‌న్న‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌న్నిహితులు కాద‌ని ఖండిస్తున్నా.. ఆయ‌న మ‌న‌సులో మాట అదేనంటున్నారు. అయితే ఉమ్మ‌డి జిల్లాలో 2014 ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఇది. పార్టీ బ‌లంతో పాటు.. జ‌ల‌గం వెంక‌ట్రావు వ్య‌క్తిగ‌త ఇమేజ్ తో ఇక్క‌డ గులాబీ జెండా ఎగ‌రేశారు. మ‌రి ఆయ‌న ఖాళీ చేస్తారా? ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. స్థానికంగా ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త ఉంద‌ని.. అవ‌కాశం ఇస్తే తాను గెలుచుకుని వ‌స్తాన‌ని పొంగులేటి అదిష్టానం వ‌ద్ద చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పైగా మ‌నీ ప‌వ‌ర్ ఉంది. ఎంత ఖ‌ర్చు అయినా పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జ‌ల‌గం మాత్రం స‌సేమిరా అంటున్నారు. ఖాళీ చేసే ప్ర‌స‌క్తే లేదంటున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి, జాతీయ నాయ‌కుడు జ‌ల‌గం వెంగ‌ళ‌రావు త‌న‌యుడిగా ఆయ‌న‌కు ఇమేజ్ ఉంది. ఆర్ధికంగా పొంగులేటికి ఏమాత్రం తీసిపోరు. దీంతో ఇద్ద‌రూ నువ్వా-నేనా అని పోటీప‌డుతున్నారు. బ‌య‌ట‌కు ఒక‌టే అని క‌ల‌రింగ్ ఇచ్చినా.. సీటు కోసం పోటీ ప‌డుతున్నార‌న్న‌ది జిల్లాలో బ‌హిరంగ ర‌హ‌స్యం. జ‌ల‌గం వెంక‌ట్రావుకు మ‌నీ ప‌వ‌న్ ఉంది.. తండ్రి లెగ‌సీ ఉంది. పొంగులేటికి మ‌నీ వ‌ప‌ర్ ఎక్కువే. ఇద్ద‌రూ రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులే. మ‌రి అదిష్టానం వ‌ద్ద లెగ‌సీ వ‌ర్సెస్ మ‌నీ వ‌ప‌ర్ లో ఎవ‌రి ప‌లుకుబ‌డి నిల‌బ‌డుతుందో చూడాలి.

Watch:

Recommended For You