కొత్త‌గూడెం నెంబ‌ర్‌వ‌న్‌ కానీ….!

Airport and Mining University in Kothagudem

ర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ బిల్లును బుధ‌వారం అసెంబ్లీ ఆమోదించింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో చర్చ జరిగింది. కొత్తగా 24 అర్బన్‌డెవలప్‌మెంట్ అథారటీస్ రాబోతున్నాయి. ఇందులో కొత్తగూడెం కూడా ఉంది. ఈ బిల్లుతో కొత్త‌గా ఏర్ప‌డిన ప‌ట్ట‌ణాభివృద్ది సంస్థ‌ల్లో కొత్త‌గూడెం అతిపెద్ద‌ది కానుంది. రాష్ట్రంలోనే అధిక విస్తీర్ణంలో గల పట్టణాభివృద్ధి ప్రాంతాల పరిధిలో మొదటి ఐదు స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం ముందువ‌ర‌స‌లో ఉంది. మొత్త విస్తీర్ణం 886.64 చ.కి.మీ. త‌ర్వాతే హైద‌రాబాద్‌ను ఆనుకుని ఉన్న వికారాబాద్ ఉంది. కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి చుట్టూ 10 నుంచి 20 కి.మీ. ప‌రిధిలోని గ్రామాల‌ను దీని ప‌రిధిలోని తీసుకొచ్చారు. అయితే ఇంకా మాస్ట‌ర్ ప్లాన్ రావాల్సి ఉంది. కొత్త‌గూడెం అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటి – కుడా గా దీనిని పిల‌వ‌నున్నారు. ప‌ట్ట‌ణాభివృద్ది సంస్థ రాక‌తో అభివృద్ది వేగం అందుకుంటుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. కొత్తగా ఏర్పాటు కానున్న పట్టణాభివృద్ధిసంస్థ పరిధిలోని ప్రాంతాల్లో రహదారులు, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు అన్నీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జ‌రుగుతుంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధిలోకి వచ్చే అవకాశమున్నది. స్మార్ట్ సిటీస్, అమృత్ పట్టణాల్లో భాగంగా కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయి..

అయితే కొత్త‌గూడెం ప‌ట్టణాభివృద్ది సంస్థ ఏర్పాటు అయినా.. ఇబ్బందులు మాత్రం అలాగే ఉంటాయ‌న్న వాద‌ల‌నున్నాయి. వాస్త‌వంగా కొత్త‌గూడెంతో పాటు.. స‌మీప గ్రామాల్లో 1(70) యాక్ట్ అమ‌ల్లో ఉంది. దీని వ‌ల్ల గిర‌జ‌నేతర‌ల‌కు రిజిష్ట్రేష‌న్లు ఉండ‌వు. ఇంత పెద్ద ప‌ట్ట‌ణం అయినా ఓ అపార్ట్‌మెంట్ క‌ట్టుకునే అవ‌కాశం లేదు. ఓ ప‌రిశ్ర‌మ పెట్ట‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వు. ఇంటిస్థ‌లం కూడా రిజిస్ట్రేష‌న్ చేయ‌రు. అలాంట‌ప్పుడు ఇక్క‌డ ప‌ట్ట‌ణాభివృద్ది సంస్థ వ‌చ్చినా ఉప‌యోగం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. డెవ‌ల‌ప్ మెంట్ కావాలంటే యాక్ట్‌ను స‌డ‌లించాలి. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని చుట్టూ 20 కి.మీ. ప‌రిధిలోని ప్రాంతాల‌ను గిరిజ‌న యాక్ట్‌నుంచి మిన‌హాయించాలి. అప్ప‌డే ప్ర‌భుత్వం ఆశించిన ప‌ట్ట‌ణాభివృద్ధి సాకారం అవుతుంది. మ‌రి ప్ర‌భుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుందో లేదో చూడాలి.

Recommended For You

Comments are closed.