జానా.. రేవంత్‌.. కోదండ‌రామ్……. రెడ్డి..!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా న‌డుస్తున్న చ‌ర్చ ఇదే. అధికారంలో ఉన్న వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెక్ పెట్ట‌డానికి రెడ్డి వ‌ర్గం ఏకం కావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోందా..! తెర‌ముందు ఎంత కాద‌న్నా.. తెర‌వెన‌క జ‌రుగుతున్న క‌థ కుల పంచాయితీయేనా..? అవునంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌తో మొద‌లైన ప్ర‌స్తానం 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు సాగుతుంద‌ని తెలుస్తోంది. కోదండ‌రామ్‌ను ఆయుధంగా వాడుకుని కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌న్న‌ది రెడ్డి వ‌ర్గం ఆలోచ‌న‌గా తెలుస్తోంది. వాస్త‌వానికి కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న రెడ్లు కలిసినా .. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఢీకొట్ట‌లేక‌పోతున్నారు. అందుకే తెర‌వెన‌క మంత్రాంగం మొదలుపెట్టారట. ఒక‌ప్పుడు కేసీఆర్ తెలంగాణ సాధ‌న‌లో వ‌దిలిన జేఏసీ బాణాన్నే కేసీఆర్‌పై ప్ర‌యోగిస్తుందా? దీనికోసం తెర‌వెన‌క పెద్దెత్తున మంత్రాంగం న‌డిచిన‌ట్టు చెబుతున్నారు. గ‌త వేస‌విలో కోదండ‌రామ్ విదేశీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రెడ్డి సామాజిక వ‌ర్గం అంతా మేధోమ‌థ‌నం చేసిన‌ట్టు స‌మాచారం. ఖండంత‌రాల్లో చ‌ర్చ‌లు జ‌రిపి సరికొత్త వ్యూహం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారట‌. తెలంగాణ రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకుని అధికారం త‌మ చేత‌ల్లో ఉంచుకోవాల‌న్న రెడ్డి వ‌ర్గం ఆలోచ‌న‌లో భాగంగానే కోదండ‌రామ్ ఓ అస్త్రంగా మారార‌ని టిఆర్ఎస్ అంటోంది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జాసంఘాల‌గానే స్వ‌రం పెంచితే జ‌నాల్లోకి వేగంగా చేరుకుంటుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతుంది. అందుకే కోదండ‌రామ్‌ను రెడ్డిగా కాకుండా.. పాత జేఏసీ నాయ‌కుడిగానే తెర‌వెన‌క‌పార్టీల‌కు అతీతంగా రెడ్డి సామాజిక వ‌ర్గం అంతా క‌లిసి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సిద్దం చేశారు. ఈ రెండేళ్లు ఇంకా గ‌ట్టిగా ఆయ‌న స్వ‌రం పెంచితే ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరిగితే.. రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకోవాల‌న్న‌ది ఎత్తుగ‌డ‌. అలా కేసీఆర్‌ను రాజ‌కీయంగా కంటే తెలివితో ఢీకొట్టాల‌ని కాంగ్రెస్ కోదండ‌రామ్ అస్త్రాన్ని వ‌దిలిన‌ట్టు చెబుతున్నారు. రెడ్డి వ‌ర్గం వ్యూహం పారుతుందా.. జానా.. ఉత్త‌మ్‌.. రేవంత్‌.. కోదండ‌రామ్‌.. రెడ్డి పనిచేస్తుందా…. చూడాలి.

Recommended For You

Comments are closed.