ఖమ్మంలో నామాను జనం తిరస్కరించారా?

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామా నాగేశ్వర రావు చివరి నిమిషంలో టికెట్ సంపాదించినా ఆయనకు ప్రజలు మాత్రం ఆయన్ను తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రచారం భారీగానే జరిగినా.. అన్ని వర్గాలను కలుపుకుని పోయినా.. క్షేత్రస్థాయిలో మాత్రం జనాలు ఆయనకు ఓటు వేయాలన్న అభిప్రాయం సర్వత్రా వినపడుతోంది. తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ వర్గాలు కలిసినా.. కిందస్థాయిలో కేడర్ కలవలేకపోయింది. పొంగులేటి వర్గం ప్రచారం చేసినా చివరకు ఓటు వేసే సమయానికి ముఖం చాటేశారు. అటు ప్రజాసంఘాలు,   వివిధ వర్గాలకు చెందిన నాయకులు ఓటేయలేదని అంటున్నాయి. గతంలో పువ్వాడపై ఉన్న వ్యతిరేకతతో నామాకు దగ్గరుండి ప్రచారం చేశారు. ఆయన విజయం కోసం సొంత డబ్బులతో విందులు ఏర్పాటు చేశారు. ప్రచారం చేశారు.. నామాను ఎమ్మెల్యేగా గెలిిపించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అలాంటి వర్గాలను కాదని.. ఆయన పార్టీ మారడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారంతా నామాకు ఓటేయడానికి ఇష్టపడలేదు. ఇది ప్రచారంలో స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేగా ఆయన పోటీచేసినప్పుడు మద్దతుగా ఉన్న వర్గాలేవీ ఎంపీ ప్రచారంలో పాల్గొనలేదు. టిఆర్ ఎస్ కేడర్ హడావిడి మాత్రమే కనిపించింది. అంటే నామాకు మొదటి నుంచి అండగా ఉన్న వర్గాలు కలిసిరాలేదు. ఇదే ఆయన పరాజయానికి కారణమవుతుందని లెక్కలేస్తున్నారు. పొంగులేటి మీద కోపంతో టికెట్ రాకుండా చేసిన తుమ్మల పాత కొత్త శత్రువుపై కోపంతో పాత శత్రువును గెలిపిస్తారా? లేక ఇక్కడ కూడా ఓటమిపాలవుతారా? చూడాలి

Recommended For You