తిరుమ‌ల యాత్ర‌.. విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న పెనుదుమార‌మే రేపుతోంది. విప‌క్షాల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా.. త‌న‌దైన మాట‌ల‌తో.. చేత‌ల‌తో దూసుకెళుతున్న కేసీఆర్ ఎక్క‌డ దొరుకుతారా.. ఓ చిన్న గ‌డ్డిపూచ దొరికినా ఉతికి ఆరేద్దామ‌ని వెయిక‌ళ్ల‌తో విప‌క్షాలు ఎదురుచూస్తున్నాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆయ‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌నపై రాద్దాంతం చేసే ప‌నిలో ప‌డ్డాయి. మిష‌న్‌భ‌గీర‌థ‌, ప్రాజెక్టులు అంటూ నానాయాగీ చేశాయి. అవి పెద్ద‌గా వ‌ర్కువుట్ కాలేదు. జ‌నాల్లోకి వెళ్లి యాత్రల‌తో రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నుకున్నారు. కానీ రైతుల నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. ప‌త్తికి మంచి ధ‌ర ప‌లికింది. అటు మిర్చి రికార్డు స్థాయిలో రేటు ప‌లికింది. అసంతృప్తి లేక‌పోవ‌డంతో విప‌క్షాల‌కు అన్న‌దాత‌ల మ‌ద్ద‌తు అంత‌గా ల‌భించ‌లేదు. అటు నిరుద్యోగుల‌ను వాడుకుందామ‌నుకున్నారు. కానీ ప్ర‌పంచం మొత్తం సంస్క‌ర‌ణ‌ల‌తో ప్రయివేటు రంగం వైపు ప‌రుగులు తీస్తుంటే.. కేసీఆర్ కాస్తో కూస్తో సింగ‌రేణి, జ‌న్‌కో, ఆర్టీసీ కార్పొరేష‌న్ల‌తో పాటు ప్ర‌భుత్వం ఖాళీలు భ‌ర్తీ చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే బెట‌ర్‌గానే నోటిఫికేష‌న్లు వ‌స్తున్నాయి. కోదండ‌రామ్ ఉద్య‌మమంటేనే స్పంద‌న రాలేదు. ఇక విప‌క్షాలు చేసినా ఉప‌యోగ‌ముండ‌దు.. అందుకే ఇప్పుడు తిరుమ‌ల మొక్క‌లపై వివాదాల‌కు తెర‌తీస్తున్నారు. అయితే విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డంలో త‌ప్పులేదు. కానీ స‌మ‌యం సంద‌ర్భం ముఖ్యం.
సెక్యుల‌ర్ దేశంలో ప్ర‌జాధ‌నంతో మొక్కులు తీర్చ‌డం ప‌ట్ల అభ్యంత‌రం ఉంటే.. ఇప్పుడే ఎందుకు విమ‌ర్శిస్తున్నారు. చాలాకాలం క్రిత‌మే కేసీఆర్ బంగారు ఆభ‌ర‌ణాల కోసం నిధులు కేటాయించారు. ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రత్యేక క‌మిటీ వేశారు. ప్ర‌క‌టించిన త‌ర్వాత నాలుగు ఐదుసార్లు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి. అయినా ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. ఇంత‌కాలం నిద్ర‌పోయారా? అన్న అధికార పార్టీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ప్ర‌తిప‌క్షాలు చెప్పాల్సి ఉంటుంది. రెండు ప్ర‌త్యేక విమానాల్లో వెళ్ల‌డంపై అభ్యంత‌రాలు ఉండి ఉంటే.. దీనిపై నిల‌దీయ‌వ‌చ్చు.. ప్ర‌భుత్వం ఏం స‌మాధానం చెబుతుందో వినాల్సి ఉంటుంది. లేదా అసెంబ్లీ స‌మాధానం కోసం ప‌ట్టుబ‌ట్ట‌వ‌చ్చు. అలా కాకుండా కేవ‌లం మొక్కుల‌ను టార్గెట్ చేయ‌డం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఇందులో కాంగ్రెస్ ఇందులో స‌క్సెస్ అవుతుందా.. లేక చిత్తు అవుతుందా?

Recommended For You

Comments are closed.