సర్వేపై సందేహాలెన్నో అంటున్న నాయకులు.. !

స‌ర్వేలో ఏదో తేడా జ‌రిగిందా? ఇదే ఇప్పుడు చ‌ర్చ.. ప్ర‌తిప‌క్షాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. అధికార పార్టీలో కూడా కాస్త హాట్ హాట్‌గానే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం హ‌రీష్‌రావు. స‌ర్వే ఎప్పుడు చేసినా నెంబ‌ర్ 2లో ఉండేది హ‌రీష్‌రావు. ఆయ‌న‌కు తిరుగుండ‌దు. ఇది స్వ‌యంగా కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన మాట‌. హ‌రీష్ కూడా నిరూపించుకున్నారు. భారీ మెజార్టీతో గెలిచే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవ‌రు అని   ప్ర‌తిప‌క్షాల‌ను ట‌క్కున వ‌చ్చే స‌మాధానం హ‌రీష్‌రావు. గ‌త స‌ర్వేలో కూడా హ‌రీష్‌రావు నెంబ‌ర్ 2లోనే ఉన్నారు. కానీ ఈసారి మార్కులు త‌గ్గాయి. కార‌ణం ఏంటో అని ఇప్పుడు అంతా ఆస‌క్తిగా ఆరాలు తీస్తున్నారు. ఆయ‌న కూడా ఆలోచించ‌డం లేదు కానీ పార్టీలో కొంద‌రు అదే ప‌నిగా చ‌ర్చ‌కు పెడుతున్నారు. మ‌రికొంద‌రు ఓ అడుగు ముందుకేసి స‌ర్వేపై విప‌క్షాల అనుమానాల‌కు కార‌ణం కూడా ఇదే అయిఉండొచ్చ‌ని చెబుతున్నారు. పైగా కేటీఆర్ హ‌రీష్‌ను దాటిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని అంటున్నారు. 98 శాతం మార్కులతో మొదటి స్థానంలో కేసీఆర్. ఆయన తనయుడు మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు 91 శాతం మార్కులతో రెండో స్థానంలో ఉన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావుకు 88 శాతం మార్కులే వచ్చాయి. అయితే కేసీఆర్ అంత ఆషామాషీగా చేసి ఉండరు.. పక్కా సమాచారంతోనే సర్వే బయటపెట్టి ఉంటారని చెబుతున్నారు.  నిజంగా మేనేజ్ చేయాలనుకుంటే జగదీశ్ రెడ్డి మార్కులు పెంచి చూపించేవారు కదా.. అంటున్నారు. సో… హరీష్కు కూడా వచ్చిన మార్కులే వేశారంటున్నారు.

Other news:- అమెరికాలో రామన్న దండయత్ర అదేనా? వాచ్ వీడియో

Recommended For You

Comments are closed.