ప్ర‌త్య‌ర్ధుల పొత్తుల‌ను కూడా కేసీఆర్ శాసిస్తున్నారా?

తెలంగాణ‌లో పోస్ట్ పోల్ పొత్తులు మాత్ర‌మే ఉంటాయా..? ముందస్త పొత్తుల‌ను కేసీఆర్ వ్య‌తిరేకిస్తున్నారా? ఆయ‌నే కాదు…టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ – వామ‌ప‌క్షాల పొత్తు కూడా కేసీఆర్ కు ఇష్టం లేదా? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర స‌మితి క‌ష్ట‌ప‌డ‌కుండా.. సుల‌భంగా 2019 ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాలంటే పొత్తులు ఉండ‌కూడ‌దు. ఎవ‌రికి వారు సొంతంగా పోటీ చేయాలి. లేదంటే ఫ‌ర‌క్ ప‌డుతుంద‌న్న‌ది గులాబీ శ్రేణుల విశ్లేష‌ణ‌గా తెలుస్తోంది. తెలంగాణ‌లో ఎంత‌టి నాయ‌కులు వీడిపోయినా.. తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత ఓటుబ్యాంకు ఉంది. ఖ‌చ్చితంగా ఉంటుంది. ఇక బీజేపీకి ఫ‌ర్వాలేదు. వామ‌ప‌క్షాలకు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల బ‌లం ఉంది. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ఉంది. ఇవ‌న్నీ క‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్పడి పోటీ చేస్తే త‌మ విజ‌యావ‌కాశాల‌ను గండిప‌డుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ బ‌లంతో హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, మిర్యాల‌గూడ వంటి చోట్ల క‌లిపి క‌నీసం 20-30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లితాలు తారుమార‌య్యే అవ‌కాశం ఉంది. ఇక న్యూట్ర‌ల్ ఓట్లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌డితే అంచ‌నాలు త‌ల‌కిందులు అవుతాయి. అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలంటే పొత్తులు చెదిరిపోవాలి. మ‌హాకూట‌మి ప్ర‌తిపాద‌న‌లు లేకుండా చేయాలి. ప్ర‌త్య‌ర్ధుల కల‌వ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.. అదే స‌మ‌యంలో టీడీపీ ఓటుబ్యాంకును గంప‌గుత్త‌గా త‌మ‌వైపు తిప్పుకునేందుకు మంత్రి తుమ్మ‌ల వంటివారిని రంగంలో దింప‌డానికి రంగం సిద్దం అయింది. అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌తో ఓ రాయి వేశారు. దీంతో తెలంగాన‌లో టీడీపీ నేత‌లు కొంద‌రు ఇప్ప‌టికే టీఆర్ఎస్‌తో పొత్తుకు సై అంటున్నారు. అయితే పొత్త కంటే కూడా ఎవ‌రికి వారు విడిగా పోటీ చేయ‌డం ద్వారా ఓట్లు చీలిపోయి త‌మ‌కు మేలు జ‌రగాల‌న్న‌ది ప్ర‌ధాన రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా ఉంది. దీని వ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలు.. ఒక‌టి టీడీపీ ఒక్క‌సీటు గెల‌వ‌కుండా ఉంటే.. పార్టీ డైల్యూట్ అవుతుంది. అధికార పార్టీకి ప్ల‌స్ అవుతుంది. అదే పొత్తు ఉంటే… టీడీపీకి సీట్లు ఇవ్వాలి.. గెలిస్తే పార్టీ బ‌తుకుతుంది.. అది ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే. అంటే పార్టీ లేకుండా.. దాని ఓటు బ్యాంకు తీసుకోవాలి. మ‌రి కేసీఆర్ వ్యూహం ఫ‌లిస్తుందా? ప‌్ర‌త్య‌ర్ధుల‌ను రాజ‌కీయంగా ప‌డ‌గొడ్డి తిరుగులేని శ‌క్తిగా పార్టీని నిల‌బెడ‌తారా అన్న‌ది చూడాలి.

Recommended For You

Comments are closed.