బీజేపీ ఎమ్మెల్యేల‌తో భేటి వెన‌క వ్యూహ‌మిదేనా…!

ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. వాజ్‌పేయి విగ్ర‌హం కోసం విజ్ఞ‌ప్తి చేయ‌డానికి సీఎంను క‌లిశామ‌ని క‌మ‌ల‌నాధులు చెబుతున్నా… అస‌లు విష‌యం మాత్రం అంత‌ర్గ‌త ఎన్నిక‌ల అవ‌గాహ‌న అంటున్నారు రాజ‌కీయ పండితులు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నుకుంటున్న కేసీఆర్ కు హ‌స్తిన‌లో దాదాపు గ్రీన్ సిగ్నల్‌ వ‌చ్చింది. అయితే ఇక్క‌డున్న క‌మ‌ల‌నాథుల ఆలోచ‌న‌లు కూడా తెలుసుకోవాల‌ని కేంద్రం నాయ‌క‌త్వం భావించింది. ముంద‌స్తుపై రాష్ట్ర బీజేపీ నివేదిక అమిత్ షా కోరారు. దీంతో కేసీఆర్ ఇక్క‌డి నాయ‌క‌త్వాన్ని కూడా ముంద‌స్తుకు అనుకూలంగా నివేదిక ఇచ్చేలా వారితో చ‌ర్చించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యేల‌కు కూడా కేసీఆర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో వైఎస్, చంద్ర‌బాబు వంటి వాళ్లు ఫాలో అయిన పార్ములానే కేసీఆర్ కూడా వాళ్ల‌ముందు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. కిష‌న్ రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ స‌హా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల విజ‌యానికి త‌మ‌వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని.. వారిపై బ‌ల‌హీన అభ్య‌ర్ధుల‌ను బ‌రిలో దింపుతామ‌ని సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇది కొత్త కాదు… గ‌తంలో బీజేపీ ఇలాంటి అవ‌గాహ‌న‌లు ఎన్నోసార్లు చేసుకుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఫార్ములా వారి ముందుంచిన‌ట్టు తెలుస్తోంది. ముంద‌స్తుపై సానుకూల నివేదిక పంపేలా వారిని ఒప్పించిన‌ట్టు క‌మ‌ల‌నాథుల్లో ఓ వ‌ర్గం చెబుతోంది. ఖైర‌తాబాద్ విష‌యంలో కూడా చింత‌లకు అభ‌యం ఇచ్చాఇర‌ట‌. అక్క‌డ దానం నాగేంద‌ర్ ను కాకుండా.. మైనార్టీ అభ్య‌ర్ధిని టిఆర్ఎస్ రంగంలో దింపుతుంద‌ని తెలుస్తోంది. గోషా మ‌హ‌ల్ లో దానం పోటీచేసే అవ‌కాశం ఉంది. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే అయినా.. ఆయ‌న పార్టీకి రాజీనామా చేశారు.. పైగా ఆయ‌న పోటీకి కూడా ఆస‌క్తిచూప‌డం లేదని స‌మాచారం. మొత్తానికి బీజేపీ మ‌రోసారి ఉనికి కోసమే.. కానీ.. బ‌లలోపేతానికి ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌ని అర్ధ‌మ‌యిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఏది ఏమైనా కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం అదుర్స్ అంటున్నారు పండితులు… అటు మైనార్టీ పార్టీని, ఇటు క‌షాయ‌ద‌ళాన్ని త‌నదైన శైలిలో త‌న దరికి చేర్చుకుంటున్నారు.

Watch:

Recommended For You