క‌విత‌కు కేబినెట్‌లో బెర్తు ఖాయ‌మా..!

తెలంగాణ‌లో రాజ‌కీయ‌ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. మొద‌ట్లో కేంద్రంతో ల‌డాయి పెట్టుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత ఆచితూచి స్పందించ‌డం మొద‌లుపెట్టింది. ఇప్పుడు నోట్ల ర‌ద్దుతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం త‌ల‌కిందులు అయినా స‌రే.. కేంద్రంపై ప‌ల్లెత్తు మాట అన‌లేదు. మ‌మ‌త బెన‌ర్జి వంటి వాళ్లు యుద్ధం ప్ర‌క‌టించినా.. కేసీఆర్ మాత్రం స‌హ‌నంతో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో భాగంగానే స‌ల‌హాలు ఇచ్చి మోడీ మెప్పు కూడా పొందారు. తాజాగా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌తో మోడీ స‌న్నిహితంగా మెల‌గ‌డం చూస్తుంటే.. త్వ‌ర‌లోనే ఎన్టీయే మిత్ర‌ప‌క్షం అవుతుందా అన్న అనుమానం కలుగుతోంది. ఢిల్లీ నుంచి సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. తదుపరి కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి చేరుతుందంటూ ఇప్ప‌టికే హ‌స్తిన‌లో ప్ర‌చారం జోరందుకుంది. బీజేపీ కూడా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో భాగ‌స్వామ్య‌ పార్టీగా ఉన్న టీడీపీకి ఇబ్బంది లేకుండా..  వాళ్లను కూడా ఒప్పించి కారును కూడా ఎక్కించుకుంటార‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే కేబినెట్‌లో క‌వితకు బెర్తు ఖాయ‌మట. రాజ్య‌స‌భ నుంచి కేకేకు అవ‌కాశం ఉంటుంది. సీనియ‌ర్‌గా, కాంగ్రెస్ మాజీ వ‌ర్కింగ్ కమిటీ సభ్యుడిగా సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కేకేకు ఛాన్స్ గ్యారెంటీ అంటున్నారు. ఇక మ‌రో బెర్తుకు సీనియర్లు జితేంద‌ర్‌రెడ్డి, వినోద్‌లు రేసులో ఉన్నా.. క‌విత‌కే క‌ట్ట‌బెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
క‌విత‌కు ప‌ద‌వి ఇస్తే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నా..కేసీఆర్ అనుచ‌రులు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. పంజాబ్‌లో ప్ర‌కాశ్‌సింగ్ బాద‌ల్ సిఎంగా ఉన్నారు. ఆయ‌న కొడుకు సుఖ్‌బీర్‌సింగ్ బాద‌ల్ డిప్యూటీ సిఎంగా ఉన్నారు. ఆయ‌న భార్య హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ కేంంద్రమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమె సోద‌రుడు కూడా పంజాబ్‌లో మంత్రిగానే ఉన్నార‌ని గుర్తు చేస్తున్నారు. ప్ర‌తిభ‌ను చూడాలి కానీ, కుటుంబం కాద‌ంటున్నారు. వాస్త‌వానికి కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు ప‌ద‌వుల్లో ఉన్న‌వారంతా త‌మ‌ను తాము ప్రూవ్‌చేసుకున్నారు.. ప్ర‌జాక్షేత్రంలో గెలిచారు. కాబ‌ట్టి వారిపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా అస్కారం లేద‌న్న అభిప్రాయం బలంగా ఉంది. రాజ‌కీయాల్లో స‌మ‌ర్ద‌త అవ‌స‌రం. నేప‌థ్యం ఏదైనా ఫ‌ర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి కూడా అదే వ‌ర్తిస్తుందట‌.

Recommended For You

Comments are closed.