టిఆర్ఎస్ ఎంపీ క‌విత‌ జగిత్యాల ప్లాన్ ఇదేనా…!

పార్ల‌మెంట్ కు కాదు.. అసెంబ్లీకే క‌విత పోటీచేస్తారంటూ జ‌రిగిన ప్ర‌చారానికి తెర‌ప‌డిందా..? గ‌త కొంత‌కాలంగా క‌ల్వ‌కుంట్ల క‌విత అసెంబ్లీకి పోటీచేస్తార‌ని.. ఇప్ప‌టికే జ‌గిత్యాలో ఆమె పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆమె కూడా జ‌గిత్యాల‌లో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తుండ‌డం వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చింది. అయితే క‌విత అక్క‌డ పోటీ చేయ‌డం లేద‌ని.. ఆమే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. జ‌గిత్యాల‌లో గ‌తంలో పోటీచేసిన ఓడిపోయిన సంజ‌య్ మ‌ళ్లీ పోటీచేస్తార‌ని ప్ర‌క‌టించారు. దీంతో క‌విత పోటీచేయ‌ర‌ని క్లారిటీ వ‌చ్చింది. మ‌ళ్లీ పార్ల‌మెంట్ కే పోటీచేస్తార‌ని తెలుస్తోంది. కేటీఆర్ , హ‌రీష్ ఇక్క‌డే ఉంటారు.. వీరిలో ఎవ‌రినో ఒక‌రిని పార్ల‌మెంట్ కు పంపితే కానీ.. క‌విత అసెంబ్లీకి రాలేని ప‌రిస్థితి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హ‌రీష్ రావును పార్ల‌మెంట్ కు తీసుకెళ్లే సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. క‌విత ఇక్క‌డే ఉండాల‌ని ప‌ట్టుబ‌డితే.. కేసీఆర్ ప్లాన్ బి కూడా సిద్దం చేశార‌ట‌.ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే.. హ‌రీష్ రావు ఎలాగూ అసెంబ్లీలో గెలుస్తారు.. త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నాటికి గెలుపు గుర్రాలు కావాల్సిందేన‌ని, సీనియ‌ర్లు పోటీచేయాల‌ని చెబుతున్న కేసీఆర్‌ హ‌రీష్ రావును లోక్ స‌భ‌కు పోటీచేయించే అవ‌కాశం ఉంది. అలా ఖాళీ అయ్యే సీటును క‌విత‌కు అప్ప‌గించ‌డానికి ఆస్కారం ఉంది. అలా అయితే హ‌రీష్ రావు సేవ‌ల‌ను అటు అసెంబ్లీకి, ఇటు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు వాడుకున్న‌ట్టు ఉంటుంది. క‌విత అసెంబ్లీ కోరిక తీరుతుందని అంటున్నారు. మ‌రోవాద‌న కూడా ఉంది. జ‌గిత్యాల ఎమ్మెల్యే కొంత‌కాలంగా టిఆర్ఎస్ తో ట‌చ్ లో ఉంటున్నార‌ని… ఆయ‌న ముంద‌స్తు అవ‌గాహ‌న కుదుర్చుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవే త‌న‌కు చివరి ఎన్నిక‌ల‌ని చెబుతున్న జీవ‌న్ రెడ్డి.. అవ‌స‌ర‌మైతే ఎన్నిక‌ల త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇస్తే పార్టీ మార‌డానికి కూడా సిద్ద‌మైనట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే జ‌గిత్యాల‌లో క‌విత ప‌క్క‌కు త‌ప్పుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.
Watch video:

Recommended For You