జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బ‌తిమిలాడాల్సి వ‌చ్చిందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల‌ను అల‌రిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోను తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచయం చేయ‌నున్నారు. యాంక‌ర్‌గా చేయ‌డానికి యంగ్ టైగ‌ర్ అంగీక‌రించారు. జూనియ‌ర్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోయినా.. స్టార్ టీవీ యాజ‌మాన్యం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఒప్పించిన‌ట్టు స‌మాచారం. హిందీలో  ఇప్ప‌టికే స‌ల్మాన్‌ఖాన్ చేస్తున్నారు. త‌మిళ, తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో  కొత్త‌గా తీసుకొస్తున్నారు. త‌మిళంలో ధ‌నుష్‌, క‌న్న‌డ‌లో సూస‌ర్‌స్టార్‌ సుదీప్ చేయ‌నున్నారు. తెలుగులో ఎన్టీయార్ కు ఉన్న మార్కెట్ దృష్ట్య్కా షోకు మంచి రేటింగ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. డైలాగులు అయినా… మాట‌లు అయినా అధ్బుతంగా ప‌లికించ‌గ‌ల ఎన్టీయార్ దీనికి క‌రెక్ట్ అంటున్నారు. ఎన్టీయార్ బ‌య‌ట స్నేహితుల‌తో ఉండే తీరుతెన్నులు, స‌హ‌జ‌త్వం, క‌లివిడిత‌నం ఈ షోకు స‌రిగ్గా స‌రిపోతాయ‌ని స్టార్ కంపెనీ భావించింది. ఇందుకోసం భారీగానే రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో నాగ్‌తో మాటీవీ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు చేసి స‌క్సెస్ అయింది. కానీ త‌ర్వాత చిరంజీవి చేసినా పెద్ద‌గా జ‌నాల్లోకి వెళ్ల‌లేద‌న్న భావ‌న ఉంది. కానీ ఎన్టీఆర్ వంటి యంగ్ ఎన‌ర్జిటిక్ ఆర్టిస్టుతో దూసుకొస్తోంది. స‌క్సెస్ గ్యారెంటీ అంటోంది. ఏమైనా ఎన్టీయార్ అభిమానుల‌కు పండ‌గే… వారంవారం టీవీలో సంద‌డి చేస్తారు.

Recommended For You

Comments are closed.