కేసీఆర్ దగ్గరే సమాచారశాఖ.. మరి సీఎంకు తెలిసే చర్యలు?

జర్నలిస్ట్ ల పై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వార్తలో నిజం లేదని ఏకంగా అక్రిడేషన్ రద్దు చేసిన మేడ్చల్ కలెక్టర్. ఈనాడు మేడ్చల్ జిల్లా రిపోర్టర్ బానుచందర్ రెడ్డి.. ఇటీవల ఓ కథనం రాశారు. ప్రస్తుతం తార్నాకలో ఉన్న HMDA కార్యాలయం త్వరలోనే అమీర్ పేటకు మారుస్తారంటూ కథనం సారాంశం. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తప్పుడు కథనాలు రాశారని ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు.. తప్పుడు వార్త రాసిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించింది. దీంతో కలెక్టర్ వెంటనే రిపోర్టర్ అక్రిడేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వార్తలో నిజం లేదని తెలిస్తే వివరణ ఇస్తే బాగుండేది… ఏకంగా అక్రిడేషన్ రద్దు చేయడం సబబు కాదని అంటున్నాయి. అయితే దీనిపై ఎవరితో మాట్లాడాలో కూడా పాపం జర్నలిస్టు సంఘాలకు అర్ధం కావడం లేదు. సమాచారశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు. సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరి సీఎం ను కలిసి… Continu Down

Watch Video

చర్యలు ఉపసంహరించుకోమని  ఎవరు చెప్పాలి.  పైగా కేసీఆర్ కు తెలియకుండా ఈ నిర్ణయం ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం తప్పుడు వార్తలు రాసేవారిపై కఠినంగా ఉంటామని గతంలోనే చెప్పింది. కేటీఆర్ కూడా పలుసందర్భాల్లో జర్నలిస్టులు, యాజమాన్యాలు అదుపుతప్పితే కఠినంగా వ్యవహరిస్తామని.. సంఘాలు కూడా రాద్దాంతం చేయవద్దని ముందే హెచ్చరించారు. ఇందులో భాగంగానే తాజాగా నిర్ణయం. దీంతో జర్నలిస్టు సంఘాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొత్తానికి ఈ వ్యవహారంలో జర్నలిస్టు సంఘాల పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. సీఎం వద్ద ప్రస్తావించే ధైర్యం చేయలేరు.. ఇటు జర్నలిస్టులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి సమస్యలకు పరిష్కారం ఎంటో..

 

Recommended For You