బాహుబలి తర్వాత రికార్డులన్నీ దీని సొంతమేనా?

న్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్‌కు ఫుల్ రెస్సాన్స్ వ‌స్తోంది. అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. లుక్ అదుర్స్ అంటున్నారు. గ‌త సినిమాల‌తో పోల్చితే మ‌రింత సెటిల్డ్‌గా క‌నిపిస్తున్నాడ‌ని నందమూరి కుటుంబ అభిమానులు చెబుతున్నారు. విమ‌ర్శ‌కుల సైతం ఎన్టీఅర్ లుక్‌కు ఫిదా అయ్యార‌ట‌. మ‌రీ ముఖ్యంగా రావ‌ణాసురుడి బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపిస్తున్న ఎన్టీఆర్ స్టైల్ బాగుంద‌ని అంటున్నారు. జ‌న‌తా గ్యారేజి డివైడ్ టాక్‌తో 150 కోట్లు కొల్ల‌గొట్టింది.. అది జూనియ‌ర్ స‌త్తా… ఇక వ‌చ్చే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే 2వంద‌ల కోట్లు దాటుతుంద‌ని అంచ‌నా. బాహుబ‌లి త‌ర్వాత 2వంద‌ల కోట్లు దాటే తొలి సినిమాగా రికార్డు సృష్టించ‌డం ఖాయం అంటున్నారు. ఇప్ప‌టికే సినిమాకు ఫుల్ బిజినెస్ జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. శాటిలైట్ కోసం ఛాన‌ల్స్ ఇప్ప‌టికే రేసు మొద‌లుపెట్టాయి. త్రిబుల్ ధ‌మాకా కావ‌డంతో అభిమానులు రికార్డుల కోసం ఆశ‌గా చూస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ ఏం బ్రేక్ చేస్తాడో చూడాలి. అభిమానులు అప్పుడే కామెంట్లు మొద‌లుపెట్టారు. పులి వేట‌కు బ‌య‌లుదేరింది జింక‌లు జాగ్ర‌త్త అంటూ..

ఫస్ట్ లుక్ కోసం వాచ్ దిస్ వీడియో…

 

Recommended For You

Comments are closed.