జగన్ అక్కడ తెలివిగా వ్యవహరించారా?

ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా.. ఇరుకున పెట్టాలని చూసినా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఆయన అనుసరించిన విధానం ప్లస్ అయిందా… ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో, అటు మీడియాలో జగన్ వ్యతిరేక కథనాలు బారీగా వచ్చాయి. ముఖ్యంగా పార్టీ తరపున విజయవాడ నుంచి పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్( పీవీపీ) పై ఆర్ధికనేరాల కేసులు, ఇక పార్టీలో నాయకురాలిగా ఉన్న లక్ష్మి పార్వతి వ్యక్తిగత విషయాలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే దీనిపై వారు స్పందించకుండా ఉండేలా జగన్ జాగ్రత్త పడ్డారు జగన్. అదే సమయంలో స్పందించి ఉంటే.. మరింత రాద్దాంతం జరిగేది. రాజకీయంగా చర్చ ఎక్కడకో వెళ్లేది.. అలా కాకుండా.. విమర్శలు చేసినా.. దీనిపై సైలెంట్ గా ఉండడంతో ఒకటి రెండు రోజులకే చర్చ పరిమితం అయింది. ఒక్క వెర్షన్ తో మీడియా కూడా దీనిని సాగదీసే ప్రయత్నం చేయలేదు. దీంతో చర్చకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ వ్యూహంలో భాగంగా ఎన్నికలు అయిన తర్వాత పీవీపీ, లక్ష్మి పార్వతిలు తెరముందుకు వచ్చారు. పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. పీవీపీ ఓ అడుగుముందుకుసి మీడియా కొవ్వు కరిగిస్తామన్నారు. దీనిపై మీడియా ముందుకు వచ్చి తమ వివరణ ఇచ్చారు. ప్రజాతీర్పు చెప్పిన తర్వాత స్పందించినా ప్రభావం ఉండదు కాబట్టి వాటిపై తాపీగా స్పందించారు. ఈ విషయంలో జగన్ చాలా పరిణితితో వ్యవహరించారని ఆయన వర్గం అంటోంది. మరి ఇందులో నిజమెంతో?

Recommended For You