ఆత్మ విశ్వాసమా.. అత్యుత్సాహమా.. సర్వేల అభయమా?

సర్వేలు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి అవుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘంటాపథంగా చెబుతున్నారు. అభిమానుల ప్రచారం దండి జరుగుతోంది. దీంతో కొందరు ముఖ్యమంత్రి బోర్డును కూడా సిద్దం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  జగన్ తన అమరావతి, లోటస్ పాండ్, బెంగళూరు నివాసాల్లోని తన కార్యాలయానికి పెట్టడానికి ఈ మోడల్ సిద్దం చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ కు దీనికి సంబంధం లేకపోయినా ఆయనపై నమ్మకం ఉన్న కేడర్ ఈ విధంగా విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. మరి జగన్ సీఎం అవుతారా?

Recommended For You