జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని ఆయన ప్రత్యర్ధులు ఆయుధంగా మలుచుకుని విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబు ఓడిపోతున్నారని తెలిసి ఇలా రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో పోటీ నువ్వా  నేనా అన్నట్టు సాగింది. ఎన్నికల నాటికి ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కొన్ని సర్వేలు టీడీపీకి, మరికొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో ప్రజల్లో కూడా అయోమయం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ఫలితాలపై తీవ్రఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు గెలుస్తామని ధీమాగా ఉండాల్సిన సమయంలో జగన్ కాస్త స్థిమితంగానే ఉన్న.. చంద్రబాబు ఆందోళన చూస్తుంటే కేడర్ లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు గెలుస్తున్నామని భరోసా ఇవ్వడం కంటే కూడా… ఈవీఎం రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దీంతో సహజంగానే కార్యకర్తల్లోకి బలంగా పోయింది. ఓడిపోతామా అన్న సందేహాలకు కారణమవుతోంది. సరిగ్గా అదేసమయంలో జగన్ గెలుపుపై ధీమాగా ఉన్నారు… నమ్మకం ప్రదర్శస్తున్నారు. మరి ఎవరు గెలవబోతున్నారు…

Recommended For You