ఇస్రో సంచ‌ల‌న నిర్ణ‌యం…!

భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్ర – ఇస్రో మ‌రో సంచ‌ల‌నానికి సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఒకేసారి 83 శాటిలైట్స్‌ను కక్ష్య‌లోకి పంప‌నుంది. దీనికి సంబంధించిన ఇప్ప‌టికే ముహూర్తం ఖ‌రారు చేసింది. డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఈ ప్ర‌యోగం చేప‌డ‌తారు.  PSLV-C37 ద్వారా వీటిని అంత‌రిక్షంలోకి పంపుతారు. ఇందులో ఇజ్రాయిల్‌, ఖ‌జికిస్తాన్‌, నెథ‌ర్లాండ్‌, స్విట్జ‌ర్లాండ్‌, అమెరికాకు చెందిన 80 ఉప‌గ్ర‌హాలున్నాయి. ఇవ‌న్నీ క‌లిపి 5వంద‌ల కేజీల బ‌రువుంటాయి. ఇక మిగిలిన మూడు భార‌త్‌కు చెందిన 730 కేజీల పేలోడ్ ఉన్న Cartosat-2 సీరిస్,  INS-IA మరియూ INS-1B ఉప‌గ్ర‌హాలున్నాయి. గ‌తంలో ఇస్రో PSLV-C34 ద్వారా జూన్ 2016లో ఒకేసారి 20 ఉప‌గ్ర‌హాలు పంపి రికార్డు సృష్టించింది. అంత‌కుముందు  2008లో 10 శాటిలైట్ల‌ను క‌క్ష్య‌లో చేర్చి చ‌రిత్ర సృష్టించింది. ఇక 2017 వ‌ర‌స‌గా 5 ప్ర‌యోగాల‌తో స‌మాచార రంగంలో ఇస్రో స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని సంస్థ శాస్త్ర‌వేత్త‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రిన్ని ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయ‌ని గుర్తు చేస్తున్నారు.

Recommended For You

Comments are closed.