మ‌నం కొనే బంగారం మంచిదేనా…!

కార్పోరేట్ ప్ర‌క‌ట‌న‌లు, డిస్కౌంట్లు, భారీ ఆఫ‌ర్లతో బంగారం షాపులు పోటీప‌డుతున్నాయి. ధ‌ర‌ల యుద్ధం కూడా త‌ర‌చుగా వినిపిస్తోంది. మ‌రి ఇంత పోటీ ప్ర‌పంచంలో వ్యాపారుల‌కు గిట్టుబాటు అవుతుందా.. లేక అందులో మ‌త‌ల‌బు ఉందా. అంతా మాయ‌గాళ్లు అని అన‌డం లేదు. కానీ వారు చేస్తున్న వ్యాపారానికి, ఇస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌కు, చేస్తున్న వ్య‌యానికి ఏమాత్రం పొంత‌న లేద‌నేది విస్ప‌ష్టం. ఈ చిన్న లాజిక్ అర్ధం చేసుకుంటే ఐటీ శాఖ దారులు అటుగా ప‌డ‌తాయంటున్నారు ఆర్ధిక నిపుణులు.

సాధార‌ణంగా దుస్తుల వ్యాపారంలో 50 శాతం నుంచి 25శాతం దాకా లాభాలు ఉంటాయి. అందుకే పెద్ద పెద్ద షాపుల వాళ్లు ఖ‌ర్చు కూడా అంతే స్థాయిలో చేస్తారు. భారీ ప్ర‌చారం, హోర్డింగులు ఇలా కోట్లు వెచ్చిస్తారు. ఇది పెద్ద‌గా అనుమానించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ బంగారు న‌గ‌లు అమ్మే షాపులు కూడా ఇంత ఖ‌ర్చు చేస్తున్నాయంటే సందేహాలు స‌హ‌జం. అవును కోట్లు ఖ‌ర్చు చేసి సెల‌బ్రిటీల‌ను ప్ర‌చార‌క‌ర్త‌లుగా నియ‌మిస్తున్నారు. ఇక న‌గ‌రాల్లో ప్ర‌ధాన సెంట‌ర్ల‌లో ల‌క్ష‌లు అద్దెలు క‌ట్టి దుకాణాలు తెరుస్తున్నారు. ప్ర‌చారం పేరుతో కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. సిబ్బంది, లోప‌ల షోరూమ్ నిర్వ‌హ‌ణ‌కే నెల‌నెలా ల‌క్ష‌లు అవుతోంది. మ‌రి నిజంగా వాళ్లు అమ్మే బంగారం ఎంత‌.. అందులో వ‌స్తున్న‌ లాభమెంత‌? బంగారం అమ్మితే అన్ని కోట్లు మిగులుతాయా? ఎన్ని ట‌న్నుల బంగారం అమ్మితే వారికి కోట్లు మిగ‌లాలి..?

దేశంలోకి ఏటా సుమారు వెయ్యి ట‌న్నుల బంగారం దిగుమ‌తి అవుతోంది. కానీ దేశంలో ఉన్న అన్ని బంగారు దుకాణాదారుల ప్ర‌చారం నిర్వ‌హ‌ణ‌ ఖ‌ర్చు ఇందులో స‌గం విలువ ఉంటుంద‌ని ఓ అంచ‌నా. అంటే వారికి 50శాతం లాభాలు వ‌స్తున్నాయా. అడ్డ‌దారుల్లో ప‌న్నులు చెల్లించ‌కుండా దేశంలోకి వ‌స్తున్న క్వింటాల కొద్దీ బంగారం ఎక్క‌డ‌కు పోతుంది. ఎయిర్‌పోర్టుల్లో దొరుకుతుంది 10శాతం మాత్ర‌మేన‌ని నిఘా వ‌ర్గాలు గ‌తంలోనే తేల్చేశాయి. అంటే మిగిలిన 90 శాతం స్మ‌గ్లింగ్ రూపంలో వ‌చ్చిన బంగారం బ్లాక్ మార్కెట్లోకి వ‌చ్చి ఎవ‌రి చేతుల్లో ప‌డుతుంది. దీనికి వ్యాపారుల‌కు సంబంధం లేకుండా ఎక్క‌డ‌కు పోతుంది. గ‌తంలో బంగారం మాఫియాకు ప‌ట్టుకున్నాం.. పెద్ద‌ల హ‌స్తం ఉంది అని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన పోలీసులు అస‌లు నిందితుల‌కు ఎందుకు ప‌ట్టుకోవ‌డం లేదు. ఎలాంటి పెద్ద‌లు ఇందులో ఉన్నారో అర్ధం చేసుకొవ‌చ్చు.

ఇక బంగారు షాపులు వాళ్లు ఏటా ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు.. వారికి వ‌స్తున్న ఆదాయం ఎంత అనేది ఐటీ శాఖ లెక్క‌లు తీస్తే నిజాలు నిగ్గుతేలుతాయంటున్నారు. పోనీ బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నామ‌ని చెప్పినా.. మ‌ళ్లీ న‌ష్టాల పేరుతో భ‌విష్య‌త్తులో బ్యాంకుల‌కు శ‌ఠ‌గోపం పెట్ట‌రా.. అలా అయినా ప్ర‌జాథ‌నం దోచుకోవ‌డ‌మే క‌దా..

ఒక‌టి వ్యాపారులు అక్ర‌మంగా వ‌చ్చిన బంగారం అమ్మ‌కం ద్వారా వ‌స్తున్న ఆదాయం ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే క‌స్ల‌మ‌ర్ల‌కు అమ్ముతున్న న‌గ‌ల్లో మ‌త‌ల‌బు ఉండాలి.. అదీ కాదంటే ప్ర‌చార ఆర్బాటం చూపించి బ్యాంకు రుణాల‌తో మాయ చేస్తుండాలి. అంతే కానీ వారు అమ్మె బంగారానికి, జ‌రుగుతున్న ప్ర‌చార‌, నిర్వ‌హ‌ణ వ్య‌యాల‌కు సంబంధం లేదంటున్నారు నిపుణులు. మ‌రి ఐటీ శాఖ ఈ దిశ‌గా ఆలోచిస్తుందా. బంగారం వ్యాపారం ఎంత లాభ‌దాకయ‌క‌మో తేలుస్తుందా.. చూడాలి. అయితే అంద‌రు వ్యాపారులు అలా చేస్తార‌ని బావించడానికి లేదు. కొంద‌రు మాత్రం త‌ప్ప‌కుండా అక్ర‌మాలకు పాల్ప‌డుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. తేల్చాల్సింది ప్ర‌భుత్వ‌మే.

Recommended For You

Comments are closed.