రాత్రి ప‌డుకునే ముందు మంచినీళ్లు తాగితే ఏమ‌వుతుందో తెలుసా?

ప‌డుకునేముందు మంచినీళ్లు తాగితే స‌మ‌స్య‌లు వ‌స్తాయంటున్నారు నిపుణులు. నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదే క‌దా… అనారోగ్యం ఎందుకు అని ఆలోచిస్తున్నారా… దీనికో లాజిక్ చెబుతున్నారు ప‌రిశోధ‌కులు. రాత్రి ప‌డుకునే ముందు నీళ్లు ఎక్కువ‌గా తాగ‌వద్ద‌ట‌. అలా తాగితే యూరిన‌ల్స్ కోసం ప‌దేప‌దే లేవాల్సి వ‌స్తుంద‌ట‌. షుగ‌ర్ పేషెంట్లు అయితే మ‌హా ఇబ్బంది అంటున్నారు. అలా  ఒక‌టికి రెండు సార్లు లేవ‌డం వ‌ల్ల స‌రైన నిద్ర క‌రువవుతుంది. దీని వ‌ల్ల కొత్త‌గా నిద్రలేమి స‌మ‌స్య‌లు పుట్టుకొస్తాయ‌ట‌. బీపీ, డిప్రెష‌న్ వంటి వ్యాధులు వ‌స్తాయంటున్నారు. ఇక డైటింగ్ ద్వారా స‌న్న‌గా అవ్వాల‌నుకుంటున్న వారు త‌గ్గ‌క‌పోగా.. బ‌రువు ఇంకా పెరుగుతార‌ని చెబుతున్నారు. అయితే మంచినీళ్లు ఎంత తాగితే అంత మంచిది. అలాగ‌ని ఇష్ట‌మొచ్చిన‌ప్పుడు తాగితే ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటున్నారు. వాట‌ర్ తీసుకునేట‌ప్పుడు చిన్న జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు. అలాగ‌ని మంచినీళ్లు మాత్రం తాగ‌డం ఆప‌వ‌ద్దంటున్నారు. కాక‌పోతే వేళాపాళా చూసుకోమంటున్నారు.

Recommended For You

Comments are closed.