భ‌ర‌త్‌ను అంతా మంచోడే అంటున్నారు కానీ… ?

హీరో ర‌వితేజ త‌మ్ముడు భ‌ర‌త్ ప్రమాదంలో చ‌నిపోయిన త‌ర్వాత ఒక్క‌క్క‌టిగా ఆయ‌న‌కు సంబంధించిన అంశాలు వెలుగుచూస్తున్నాయి. భ‌ర‌త్ గురించి తెలిసిన వారంతా కూడా మ‌నిషి మంచోడే కానీ… అల‌వాట్లే నాశ‌నం చేశాయంటున్నారు. వ్య‌క్తిగ‌తంగా భ‌ర‌త్ ఎప్పుడూ కూడా స్నేహితుల‌ను, ఇండ‌స్ట్రీలో పెద్ద‌ల‌ను ఇబ్బంది పెట్లలేద‌ట‌. క‌నీసం స‌హాయం కూడా అడిగేవాడు కాద‌ని అంటున్నారు. భ‌ర‌త్‌కు ఆస్తులు కూడా ఉన్నాయ‌ట‌. వాళ్ల అమ్మ ముందే జాగ్ర‌త్త‌ప‌డి వారికి నెల‌నెల ఆదాయం వ‌చ్చేలా ప‌క్కా ఏర్పాట్లు చేశార‌ట‌. దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు లేవు. పైగా స్నేహితులు కూడా ఉన్నారు. అయినా అల‌వాట్లు భ‌ర‌త్‌ను కుటుంబ‌స‌భ్యుల‌కు దూరం చేశాయ‌ట‌. ఆయ‌న భార్య కూడా కొంత‌కాలం ఉండి.. త‌ర్వాత భ‌ర‌త్‌తో ఉండ‌లేక‌ అమెరికా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. భ‌ర‌త్ భార్య కుటుంబం కూడా సంప‌న్నులేన‌ట‌. అయినా ఏనాడూ వారి ఆస్తి గురించి భ‌ర‌త్ అడ‌గ‌లేద‌ని.. త‌న‌కు ఉన్న‌దాంట్లో సంతోష‌ప‌డేవాడ‌ని కొంద‌రు స్నేహితులు చెబుతున్నారు. రెండుమూడుసార్లు అల‌వాట్లు వ‌దిలేసి మారాల‌ని ప్ర‌య‌త్నించినా సాద్యం కాలేదట‌. అస‌లు చెడు అల‌వాట్ల‌కు కార‌ణం..సినిమాల్లో స‌క్స‌స్ రాక‌పోవ‌డ‌మే అంటున్నారు కొంద‌రు. అనేక సంద‌ర్భాల్లో త‌న వ‌ల్ల కుటుంబ స‌భ్యులు కూడా బాధ‌ప‌డుతున్నార‌ని త‌ను బ‌త‌క‌డ‌మే వేస్ట్ అంటూ భ‌ర‌త్ వాపోయిన‌ట్టు ఫ్రెండ్స్ చెబుతున్నారు. భ‌ర‌త్ వ‌ల్ల ఎప్పుడూ కూడా ఎవ‌రూ న‌ష్ట‌పోయాం.. ఇబ్బందులు ప‌డ్డాం అని చెప్పిన వారు లేర‌ని.. ఇదే భ‌ర‌త్ తీరుకు అద్దం ప‌డుతుందంటున్నారు. చివ‌ర‌కు ఆయ‌న అల‌వాట్లు ఆయ‌న్నే చంపాయ‌ని చెబుతున్నారు.

Recommended For You

Comments are closed.