ఏడాదికి రూ.25వేల కోట్ల ఆదాయ‌మ‌ట‌

భార‌తీయ సినిమాలు భారీ వ‌సూళ్ల దిశ‌గా దూసుక‌పోతున్నాయ‌ట‌. గ‌డిచిన రెండేళ్లుగా రికార్డులు సృష్టిస్తున్నాయి. భార‌తీయ సినిమాలు 2020 నాటికి మొత్తం 25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తాయ‌ని ప్ర‌ముఖ సంస్థ‌లు అంచ‌నా వ‌వేస్తున్నాయి. అవును ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ ఆర్ధిక స‌ర్వే సంస్థ డెలాయిట్ ఇండివుడ్ తొలిసారిగా భార‌తీయ సినిమా మార్కెట్‌పై నివేదికను విడుద‌ల చేసింది. మొత్తం 20 భాష‌ల్లో 2వేలకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం 15వేల కోట్లు వ‌సూళ్లు చేస్తున్నాయ‌ట‌.. త్వ‌ర‌లోనే ఇది 25వేల కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేసింది సంస్థ‌. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో భారతీయ సినిమాల‌కు డిమాండ్ కూడా పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఆదాయం పెర‌గ‌డానికి అదే కార‌ణ‌మంటున్నాయి. పైగా మ‌ల్టీప్లెక్స్ లు కూడా ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు. హాలీవుడ్‌లో యూఎస్‌, కెనడాల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు 7వంద‌లే అయినా.. 70వేల కోట్ల మార్కెట్ క‌లిగి ఉంద‌ట‌. ఆ త‌ర్వాత స్థానం భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌దే అంటున్నారు. త్వ‌ర‌లో భార‌త్‌లో కూడా భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌స్తాయ‌ని అంటున్నారు. విశ్వ విప‌ణిలో స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే భార‌తీయ మార్కెట్‌పై హాలీవుడ్ సంస్థల క‌న్ను ప‌డింది. మ‌రిన్ని కంపెనీలు రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నివేదిక‌లు వాటికి ఊత‌మిస్తున్నాయి.

Recommended For You