భార‌త్ ఓట‌మికి అస‌లు కార‌ణం అదేనా?

ప్పు తెస్తారునుకుంటే.. ఫైన‌ల్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి తిరుగుట‌పా క‌ట్టారు. పాకిస్తాన్‌పై ఒత్తిడి ఉంటుంద‌ని క్రికెట్ పండితులు తెగ లెక్చ‌ర్లు ఇచ్చారు. భార‌త్ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కొంప‌ముంచింది. కెప్ట‌న్ కోహ్లీ అత్యుత్సాహం భార‌త్ న‌డ్డి విరిచింది. గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవ‌డానికి ఆట‌గాళ్లకు నైపుణ్యం లేకపోవ‌డం కాదు.. మ‌న‌వాళ్లు గొప్ప ఆట‌గాళ్లే… కానీ అస‌లు స‌మ‌స్యంతా డ్ర‌స్సింగ్ రూం. అక్క‌డ ఆట‌గాళ్ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. కోచ్‌కు – టీం కెప్ట‌న్‌కు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణతో స్పిరిట్ మొత్తం పోయింది. అంతఃక‌ల‌హాల‌తో వ్యూహాల‌ను ప‌క్క‌న‌పెట్టారు. ఎవ‌రి స్వార్థంలో వారున్నారు. కీల‌క టోర్న‌మెంట్ జ‌రుగుతున్న‌ప్పుడు కోచ్ ఎంపిక నోటిఫికేష‌న్ వేయ‌డం.. కుంబ్లేను త‌ప్పిస్తారంటూ లీకులు మొత్తం క‌లిసి టోర్నీలొ భార‌త్ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది. వైఫ‌ల్యం అంతా కెప్ట‌న్ బాధ్య‌తే. వాస్త‌వానికి కుంబ్లేతో త‌న‌కు స‌మ‌స్య‌లు ఉంటే.. కీల‌క టోర్నీకి గ‌డువు ఉండ‌గానే చెప్పాలి. లేదంటే సీరిస్ అయిందాకా ఆగాలి. కానీ సీరిస్‌కు వారం ముందు వీధికెక్కి ర‌చ్చ చేశారు. అది ఆయ‌ర అనుభ‌వ‌లేమికి, దూకుడుకు అర్ధం ప‌డుతుంది. గ‌తంలో ధోనీ త‌న అభిప్రాయాల‌ను బోర్డుకు నిక్క‌చ్చిగా చెప్పేవారు. స‌మ‌స్య‌లు ఉన్నా బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డేవాడు. అలా మిస్ట‌ర్ కూల్‌గా అందిరి మ‌న్న‌న్న‌లు పొందారు. విరాట్ వ్య‌వ‌హార‌శైలి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు అంతా కూడా కోహ్లీని టార్గెట్ చేస్తారు సందేహం లేదు.

Recommended For You

Comments are closed.