న‌న్ను చంపేయండి… ఈ బతుకు నాకొద్దంటున్నాడు ..!

26 ఏళ్లుగా కుటుంబ‌స‌భ్యులు చ‌చ్చానో. బ‌తికానో ప‌ట్టించుకోలేదు. ప్ర‌భుత్వాలు త‌న విన్నపాలకు క‌నిక‌రించ‌డం లేదు. ఇంకా ఎంత‌కాలం ఇలా ఒంట‌రిగా బ‌త‌క‌డం. బ‌తికి కూడా సాధించేదేమీ లేదు. బ‌తికున్నా.. చ‌చ్చినా ఒక‌టే అందుకే మెర్సీ కిల్లింగ్‌కు అనుమ‌తి ఇవ్వాలంటున్నాడు ఓ ఖైదీ. చిత్ర‌హింస‌లు ప‌డ‌లేను.. ఒక్క‌సారిగా చంపేయండి. మెర్సీ కిల్లింగ్‌కు అనుమ‌తి ఇవ్వండి అంటూ రాజీవ్‌గాంధీ హంత‌కుల్లో ఒక‌రైన శ్రీలంక జాతీయుడు రాబ‌ర్ట్ పాయస్ మొర‌పెట్టుకుంటున్నాడు. రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న పాయ‌స్ 26 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. ఇంత‌వ‌ర‌కు ఆత‌ని కుటుంబ‌స‌భ్యులు బంధువులు ఒక్క‌సారి కూడా చూడ‌టానికి రాలేద‌ట‌. విడుద‌ల అవ‌తాడాని న‌మ్మ‌కం లేదు. ఎంత‌కాలం ఉన్నా జైల్లో చ‌నిపోవాల్సిందే. అటు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అండ‌గా ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ, ఎన్టీయేలు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో తాము బ‌య‌ట‌ప్ర‌పంచం చూసేది లేదు.. జీవితంలో సాధించాల్సినవి లేవు. ఎప్ప‌టికైనా ఇక్క‌డేచావాలి. అదేదో ఇప్పుడే చంపేయండి అంటూ కోరుతున్నాడు. మెర్సీ కిల్లింగ్‌కు అనుమ‌తి ఇవ్వాలంటున్నాడు. మ‌రి కోర్టులు ఏమంటాయో?

Recommended For You

Comments are closed.