ఆనందం పోయింది…ఆదాయం పోయింది…ఇంకెం మిగిలింది..!

ఐపీఎల్ ఫైన‌ల్స్ కు హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబవుతోంది. న‌గ‌ర అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వారిఆశ‌లు గ‌ల్లంతు చేస్తూ నిర్వాహ‌కులు మొండి చేయి చూపించారు. సుమారు 36వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న మ్యాచ్ టికెట్లు ఎవ‌రికి అమ్మారో తెలీదు కానీ… స‌గ‌టు అభిమానుల‌కు ఒక్క టికెట్ కూడా దొర‌క‌డం లేదు. గ్రౌండ్ వ‌ద్ద కౌంట‌ర్ క్లోజ్ అయింది. ఆన్ లైన్ కాంట్రాక్ట్ తీసుకున్న వెబ్‌సైట్లు ఊప్స్ అంటూ వెక్కిరిస్తున్నాయి. మొత్తానికి అభిమానుల‌కు 2017 ఐపీఎల్ ఫైన‌ల్ చేదు అనుభ‌వం మిగిల్చింది. అయితే ఇవ‌న్నీ బ్లాక్ చేశార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పోలీసులకు సుమారు 2వేల టికెట్లు కాంప్లీమెంట‌రీగా వ‌స్తాయి. కానీ ఈసారి వెయ్యి మాత్ర‌మే ఇచ్చార‌ట‌. హైదరాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌కు 6వేలు ఇస్తారు కానీ మూడువేల‌తో స‌ర్ధుకోమ‌న్నార‌ని వినికిడి. ఇక మీడియాకు ముఖం చాటేశారు. రాజ‌కీయ నాయ‌కుల‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి కాంప్లిమెంట‌రీలు ఇవ్వ‌లేదు. అభిమానుల‌కు అమ్మ‌లేదు. టికెట్ల‌న్నీ ఏమ‌య్యాయ‌న్న ప్ర‌శ్న న‌గ‌ర వాసుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తం బ్లాక్ రాయుళ్ల‌కు క‌మిష‌న్ ప‌ద్ద‌తిపై చేరాయ‌న్న వార్త‌లు న‌గ‌రంలో గుప్పుమంటున్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంతో పెరుమాళ్ల‌కెరుక‌. ఇంకో దారుణం ప్ర‌భుత్వం నుంచి టాక్స్ మినిహాయింపు పొందారు. అంటే ప్ర‌భుత్వానికి టికెట్ల అమ్మ‌కంపై ఆదాయం కూడా రాలేదు. మొత్తంగా రాష్ట్రానికి, అభిమానుల‌కు హైద‌రాబాద్ ఫ్రాంచైజీ ద‌క్కించుకున్న అర‌వ కంపెనీ అడ్డంగా శ‌ఠ‌గోపం పెడుతోంది. మ‌రి మ‌న పెద్ద‌లు ఏం చేస్తున్న‌ట్టో.

Recommended For You

Comments are closed.