హీరోయిన్ల‌తో స్నేహగీతం పాడుతున్న హీరో భార్య‌…!

ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, త‌మ‌న్నా అగ్ర‌హీరోయిన్లుగా ఉన్నారు. మంచి గుర్తింపు ఉంది. పైగా వీరు లౌక్యం తెలిసిన‌ హీరోయిన్లుగా పేరు సంపాదించారు. సంపాదన‌లోనే కాదు.. వాటిని ఎలా ఖ‌ర్చు పెట్టాలి.. పెట్టుబ‌డి పెట్టి భ‌విష్య‌త్తుకు ఎలా బంగారు బాట‌లు వేసుకోవాలో ఆలోచించే బిజినెస్ వుమెన్స్ కూడా. అందుకే మ‌రో హీరో భార్యకు వీరి మ‌న‌స్త‌త్వం భాగా ద‌గ్గ‌ర అయింద‌ట‌. ఎవ‌రో కాదు.. స్వ‌త‌హాగా వ్యాపార కుటుంబం నుంచి వ‌చ్చి హీరో రాంచ‌ర‌ణ్‌ను పెళ్లి చేసుకున్న ఉపాస‌న‌. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఆమెకు స్నేహం బాగా కుదిరింద‌ట‌. అందుకే ఇటీవ‌ల రెస్టారెంట్లు, పార్టీల్లో వీరు ముగ్గురు త‌ర‌చుగా క‌నిపిస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. హీరోయిన్లు ఇద్ద‌రూ కూడా ఉపాస‌న వ‌ద్ద వ్యాపార మెళుక‌వ‌లు నేర్చుకుంటున్నార‌ట‌. ఉపాస‌న కూడా వారి ప్రొఫ‌ష‌న‌లిజానికి దాసోహం అయ్యార‌ట‌. అందుకే స్నేహం చేస్తున్న‌ట్టు సినీ వ‌ర్గాల్లో టాక్‌. ఇప్ప‌టికే త‌మ‌న్నా రియ‌ల్ రంగంలో భారీగానే పెట్టుబ‌డులు పెట్టారు. బ్యూటీ రంగంలో వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ర‌కుల్ ఫిట్‌నెస్ బిజినెస్‌లో ఎంట‌ర్ అయ్యారు. త్వ‌ర‌లో మ‌రిన్ని న‌గ‌రాల్లో వ్యాపారం విస్త‌రించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో ముగ్గురూ క‌లిసి ఓ కొత్త వ్యాపార రంగంలో అడుగుపెడ‌తారంటూ ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో ర‌కుల్ త‌మ‌న్నా క‌లిసి గ్రీన్ టీ తాగుతున్న ఫొటో పెట్టారు. ఇది ఉపాస‌న తీసిన ఫొటో అట‌.. ఉపాస‌న‌కు గ్రీన్‌టీ అంటే ఇష్టం లేదు.. మేం మాత్రం పార్టీ చేసుకుంటున్నాం అంటూ ర‌కుల్ కామెంట్ పెట్టారు. ఉపాస‌న కూడా త‌ర‌చుగా వారిని ప్ర‌స్తావిస్తూ స‌ర‌దా కామెంట్లు పెడుతున్నారు.

Recommended For You

Comments are closed.