హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి 5 ఏళ్ల లోపు వాహనాన్ని కంపెనీనే కొంటుంది. అయితే దీనికి ఫిక్స్‌ డ్ రేటు నిర్ణయిస్తారు. మోడల్‌ ఇయర్‌ ఆధారంగా ధరను ముందుగానే నిర్ణయించి.. సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనిని తీసుకుని వెళితే రీసేల్‌ వాల్యూ దొరకడంతో పాటు.. కొత్తగా కొనే వాహనంపై ఆఫర్లు కూడా ఉంటాయి. ప్లెజర్‌, డెస్టనీ వాహనాలప ప్రస్తుతం ఆఫర్లు నడుస్తున్నాయి. బైబ్యాక్‌ ఆఫర్‌ స్కీమ్ కంపెనీ చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. అయితే ఈ పథకం కొన్ని నగరాలకే పరిమితం చేసింది. ప్రస్తుతం పూణేలో గత మార్చి నుంచి అమలు అవుతోంది. ఇది విజయవంతం కావడంతో దీనిని ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ నగరాలకు విస్తరిస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కంపెనీ చెబుతోంది. మార్కెట్‌లో ఇటీవల కంపెనీకి గట్టి పోటీ ఉంది. హోండా, సుజికీ, మహీంద్రా వంటి కంపెనీల నుంచి కొత్త ఉత్పత్తులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తమతో కలిసి పనిచేసిన హోండా కంపెనీ యాక్టీవాతో పాటు.. మరిన్ని మోడల్స్‌ తో మార్కెట్లో మెజార్డీ దక్కించుకుంటోంది. దీంతో దేశీయ దిగ్గజం హీరో కూడా మార్కెట్‌ వ్యూహాలు మార్చింది. ఇందులో భాగంగా సరికొత్త ఆఫర్లతో వస్తోంది. మరి ఈ నిర్ణయం కంపెనీకి మరింత లాభాలు తీసుకొస్తుందా? చూడాలి.

Recommended For You