స్టార్ క్రికెట‌ర్ కాదు.. రియ‌ల్‌ ఛీట‌ర్..!

మ‌హిళ‌ల క్రికెట్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ ఛీట‌ర్ అయ్యారు.. క్రికెట్ ఛీట‌ర్ అవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. అవును ఆమె ఏకంగా ప్ర‌భుత్వాన్ని పోలీసుల‌నే మోసం చేశారు. ప్ర‌పంచ క‌ప్ స‌హా ప‌లు టోర్న‌మెంట్ల‌లో అధ్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన హ‌ర్మ‌న్ కు పంజాబ్ ప్ర‌భుత్వం డిఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. ఇదే ఏడాది మార్చిలో బాధ్య‌త‌లు కూడా తీసుకున్నారు. అయితే ఈ పోస్టుకు డిగ్రీ అర్హ‌త ఉండాలి. ఆమె మీర‌ట్ లోని చ‌ర‌ణ్ సింగ్ విశ్వ‌విద్యాల‌యంలో డిగ్రీ చేసిన‌ట్టుగా ధృవ‌ప‌త్రాలు స‌మ‌ర్పించారు. హ‌ర్మ‌న్ ఇచ్చిన ప‌త్రాలు ప‌రిశీలించ‌గా అవి న‌కిలీ ప‌త్రాల‌ని తేలింది. ఆమె డిగ్రీ చేయ‌లేద‌ని తెలిసింది. దొంగ ప‌త్రాలు స‌మ‌ర్పించిన‌ట్టు పంజాబ్ పోలీసులు గుర్తించారు. అంతే ఇచ్చిన డిఎస్పీ ఉద్యోగం తిరిగి లాక్కున్నారు. ఆమె కోరుకుంటే కానిస్టేబుల్ పోస్టు ఇస్తామ‌ని చెప్పార‌ట‌. మోసం చేసినందుకు కేసులు పెడ‌దామ‌ని భావించినా ఇంకా క్రికెట్ కెరీర్ ఉంద‌ని.. ఆమెను అలా నేర‌స్తురాలుగా చూడ‌డం ఎంద‌క‌ని వ‌దిలేశార‌ట‌. టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహిస్తోన్న హర్మన్‌ప్రీత్‌ అర్జున అవార్డు కూడా అందుకుంది.

Recommended For You