హంగ్ వస్తే హరీష్ సీఎం అవుతారా?

రాజ‌కీయాల్లో సీట్ల‌తో సంబంధం లేదు.. అవ‌కాశ‌మే ప‌ద‌వులు తీసుకొస్తుంది.. క‌ర్నాట‌క‌లో జేడీఎస్ కు కాంగ్రెస్‌, బీజేపీ కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. స‌గం కూడా రాలేదు.. అయినా కుమార‌స్వామి సీఎం అయ్యారు. ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా జ‌ర‌గ‌డానికి ఆస్కారం ఉంద‌ని హ‌స్తిన‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 119 సీట్లు మాత్ర‌మే ఉన్న తెలంగాణ‌లో రెండు మూడు సీట్లు త‌ల‌రాత‌ల‌ను మార్చే అవ‌కాశం ఉంది. అదే స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తే హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతారంటూ రాజకీయ వర్గాల్లో విసృతంగా చ‌ర్చ మొద‌లైంది.

Watch: నా టార్గెట్ అదే అంటున్న హరీష్ రావు

దీనికోసం టిఆర్ఎస్ ప్ర‌త్య‌ర్ధులు పెద్ద స్కెచ్ వేసిన‌ట్టు ప్ర‌చారమూ జ‌రుగుతోంది. కొంత‌కాలంగా హ‌రీషరావు అసంతృప్తిగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి హ‌రీష్ రావు కేసీఆర్ ను కాద‌ని రాజ‌కీయంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోరు. కానీ ప‌రిస్థితులు అలా వ‌చ్చేలా విప‌క్షాలు మైండ్ గేమ్ మొద‌లుపెట్టాయి. ముందుగా హ‌రీష్ రావును దూరంగా పెట్టార‌ని ప్ర‌చారం చేయ‌డం.. ప‌త్రిక‌ల్లో, టీవీల్లో హ‌రీష్ రావుకు ప్రాధాన్య‌త లేద‌ని చెప్ప‌డం. సోష‌ల్ మీడియాలో కేటీఆర్ సీఎం అయితే హ‌రీష్ రావు ప‌రిస్థితి ఏంటి ఇలా జ‌నాల్లోకి బ‌లంగా తీసుకెళ్లి.. హ‌రీష్ రావును మాన‌సికంగా ఆలోచ‌న‌లో ప‌డేయ‌డం విప‌క్షాల వ్యూహం గాక‌నిపిస్తోంది. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో సీట్లు వ‌ద్ద కొంచెం అటు ఇటుగా ఉంటే.. పార్టీని చీల్చి వ‌స్తే సీఎం ప‌ద‌వి ఇస్తామ‌ని ఆశూపెట్ట‌డం కాంగ్రెస్ ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది.

Watch: కేటీఆర్ ఫ్యూచర్ చెప్పిన అద్దంకి దయాకర్

గ‌తంలో వైఎస్ హ‌యంలో టిఆర్ఎస్ ను చీల్చిన అనుభ‌వంతో.. ఇప్పుడు 10 నుంచి 15 సీట్లు త‌క్కువ‌గా వ‌స్తే హ‌రీష్ రావును లాగి.. ఆయ‌న‌కే సీఎం ప‌ద‌వి ఇచ్చేలా కాంగ్రెస్ స్కెచ్ వేసింద‌ట‌. ఇది ఢిల్లీ స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. స్వీప్ చేస్తే కేసీఆర్‌.. లేదంటే హరీష్ రావు సీఎం అంటూ కాంగ్రెస్ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సీఎం ప‌ద‌వి ఎలాంటి వారినైనా ఊరిస్తుంది.. ఇందుకు హ‌రీష్ మిన‌హాయింపు కాద‌న్న‌ది 10 జ‌న్ ప‌థ్ వాద‌న‌. ఇందులో నిజ‌మెంతో కానీ.. కాంగ్రెస్ కు అత్యాశ‌ భాగానే ఉన్న‌ట్టు ఉంది… వాస్త‌వానికి హ‌రీష్ రావు మామ కేసీఆర్ ను కాద‌ని.. అడుగు కూడా ముందుకు వేయ‌డు.. ఈ లోకానికి ఆయ‌న ఎవ‌రో తెలియ‌క‌ముందే ఎమ్మెల్యే కాక‌పోయినా ఆయ‌న్ను మంత్రిని చేసిన ఘ‌న‌త కేసీఆర్ ది. అందుకే విశ్వాసానికి మారుపేరుగా అల్లుడు ఉన్నారు. అలాంటి అల్లుడు ప్ర‌త్య‌ర్ధుల వ‌ల‌కు చిక్కుతారా… అయితే కేటీఆర్ ను సీఎం కావాలంటే హ‌రీష్ రావు అనే బ‌ల‌మైన స్తంబం కేసీఆర్ కు అడ్డుగా ఉంది.. దీనిని మ‌నం వాడుకుంటే బ‌లంగా మారుతుంద‌ని కాంగ్రెస్ వాద‌న‌. మ‌రి హ‌స్తం పెద్ద‌ల క‌ల నెర‌వేఏరేదేనా? క‌ష్ట‌మే.

Watch:ఉరుకుతామో.. ఉరికిస్తామో చూసుకుందాం

Recommended For You