హ‌రీష్ రావుపై మ‌రో బృహ‌త్త‌ర బాధ్య‌త ?

దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ప‌నులు కూడా చ‌క్క‌బెడుతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో సీనియర్ నాయ‌కులు ఫ్యూచ‌ర్ కూడా అధినేత సిద్ద‌ం చేస్తున్నారు. ఇప్ప‌టికే సంతోష్ ను హ‌స్తిన‌కు పంపుతున్న కేసీఆర్‌.. హ‌రీష్ రావును కూడా ఢిల్లీకి తీసుకెళతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మెద‌క్ ఎంపీ స్థానం నుంచి హ‌రీష్ రావు పోటీ చేస్తార‌ని జిల్లాలో ఇప్పటికే విసృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌పై ప‌లుమార్లు హ‌రీష్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన కేసీఆర్‌.. ఇప్పుడు ఢిల్లీలో కూడా త‌న‌కు తోడుగా తీసుకెళ్లాల‌ని బావిస్తున్నారట. మంత్రిగా అనుభ‌వం ఉంది. మంచి ప్ర‌జాప్ర‌తినిధిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర తొ ఒప్పందాలు, జలవనరుల శాఖలో రాష్ట్రం తరపున బలంగా వాయిస్ వినిపించడంలో హరీష్ తనదైన ముద్ర వేశారు. స‌భ‌లు, స‌మావేశాల నిర్వ‌హ‌ణలో, జనసమీకరణ, పోలింగ్ మేనేజ్ మెంట్ లో ఆయ‌న‌కు ఆయ‌నే సాటిగా పేరు సంపాదించారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో దేశ వ్యాప్తంగా కేసీఆర్ పాల్గొనే స‌భ‌లు, స‌మావేశాల‌కు హ‌రీష్ ప్లానింగ్ అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నార‌ట‌. అందుకే కీల‌క సాగునీటి ప్రాజెక్టులు, ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్న ప‌థ‌కాల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని హ‌రీష్ ను కేసీఆర్ ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే.. నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఒక‌వేళ నిజమే అయితే హ‌రీష్ రావు మెద‌క్ పార్ల‌మెంట్ కు పోటీ చేస్తార‌ట‌. కేసీఆర్ న‌ల్ల‌గొండ లేదా.. ద‌క్ష‌ణ తెలంగాణ‌లో పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలోకి దిగుతార‌ని తెలుస్తోంది. త‌ద్వారా ఆ ప్రాంతాంలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌బావితం చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని కేసీఆర్ ఆలోచ‌న‌. క‌విత‌ను అసెంబ్లీకి పోటీ చేయిస్తార‌ని స‌మాచారం. హ‌రీష్ తో పాటు.. మ‌రికొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల‌ను కూడా ఢిల్లీకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, క‌డియం శ్రీహ‌రి వంటి వారిని కూడా పార్ల‌మెంట్ కు పోటీచేయిస్తే ఎలా ఉంటుంద‌న్న దానిపై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం.

Recommended For You