గూగుల్ వ‌ర్సెస్ యాపిల్ న్యూ వార్‌

యాపిల్‌… ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే.. ప్రీమియం క‌ష్ట‌మ‌ర్ల‌తో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. దీని మార్కెటింగ్ ముందు బ్లాక్‌బెర్రీ, హెచ్‌టిసి వంటి సంస్థ‌లు కూడా త‌ట్టుకోలేక స‌ర్ధుకుంటున్నాయి. మార్కెట్ లీడ‌ర్‌గానే యాపిల్ ఉంది. అయితే ఇప్పుడు పోటీలోకి తాము వ‌స్తున్నామంటోంది గూగుల్‌. గ‌తంలో నెక్స‌స్ పేరుతో మార్కెట్లోకి ఫోన్లు తీసుకొచ్చినా.. శాంసంగ్ స్ట్రాట‌జీ ముందు త‌ట్టుకోలేక‌పోతోంది. దీంతో లాభం లేద‌నుకుని ఎకాన‌మీ క్లాస్ నుంచి నేరుగా లగ్జరీ యాపిల్‌ను టార్గెట్ చేసింది. కొత్త‌గా అభివృద్ఙి చేసిన హార్డ్‌వేర్‌తో పిక్స‌ల్ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ప్రీమియం క‌ష్ట‌మ‌ర్లు ల‌క్ష్యంగా చేసుకుంది.
యాపిల్‌లో ఉన్న సిరి త‌ర‌హా రెస్పాన్స్ ఇన్‌బిల్ట్‌ సిస్ట‌మ్ త‌మ ఫోనులో ఉంటుంద‌ని గూగుల్ చెబుతోంది.


అంతే కాదు.. 12.5 మెగాపిక్స‌ల్ స్మార్ట్ కెమెరా తీసుకొస్తోంది. క్లౌడ్ టెక్నాల‌జీతో పాటు.. క‌స్ట‌మ‌ర్ల‌కు లోక‌ల్ స‌ర్వీసులు కూడా ఇన్‌బిల్ట్ యాప్స్ ద్వారా అందిస్తుంద‌ట‌. రెస్టారెంట్ల‌లో టేబుల్ బుక్ చేయ‌డం… స‌మీపంలో జ‌రిగే ఈవెంట్ల స‌మాచారం స‌మ‌స్తం ఉండే స్మార్ట్ మొబైల్ అంటోంది. ఇక ఆఫీస్ వ‌ర్కు చేసుకునే వారికి అన్న ర‌కాల అప్లికేష‌న్లు, టెంప్లేట్స్ ఉంటాయ‌ట‌. వైర‌స్ ఫ్రీ అంటోంది. నాజూకు డిజైన్‌తో ఎలా చూసినా యాపిల్ కంటే రెండాకులు ఎక్కువే అంటోంది గూగుల్‌. ధ‌ర కూడా అదే రేంజ్‌లో ఉందట‌. బేసిక్ ప్రైస్ వ‌చ్చేసి 6వంద‌ల డాల‌ర్లు అంటున్నారు.. అంటే సుమారు 40వేలు. ముందుగా అమెరికా ఆత‌ర్వాత మిగ‌తా దేశాల్లో ఫోను విడుద‌ల చేయ‌నున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఈవెంట్‌లో దీనిని రిలీజ్ చేస్తార‌ట‌. మ‌రి గ‌తంలో శాంసంగ్‌తో నెక్స‌స్ స‌ర్దుకుంది.. ఇప్పుడు యాపిల్‌తో త‌ట్టుకుంటుందా?

Recommended For You

Comments are closed.