గుడ్ బై చెప్పిన అంతర్జాతీయ క్రీఢాకారిణి

riturani

మహిళల హాకీ మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. రియో ఒలింపిక్స్‌కు జట్టులో చో టు దక్కనందుకు నిరాశ చెందిన ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెయిల్ ద్వారా తన నిర్ణయాన్ని హాకీ ఇం డియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు బాత్రాకు తెలియజేసింది. ఆదివారం నుంచి భోపాల్‌లో ప్రారంభంకానున్న జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపిక చేసిన 29మంది ప్రాబబుల్స్‌లో రీతూకు చోటు కల్పించారు. అప్పటికే నిరాశ చెందిన రీతూ రెండురోజుల కిందట జాతీయ శిబిరంలో పాల్గొనలేనని, అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు లేఖ రాసింది.

Recommended For You