మోడీకి – చంద్ర‌బాబుకు చెడిందా?

చంద్ర‌బాబు-మోడీ మ‌ధ్య గ్యాప్ పెరుగుతుందా.. ఇప్పుడు హ‌స్తిన నుంచి అమ‌రావ‌తి దాకా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. మోడీ వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. క్యాష్‌లెస్ ఎకాన‌మీగా మార్చ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చంద్ర‌బాబు నేతృత్వంలో క‌మిటీ వేసింది కేంద్రం. స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల్సిన క‌మిటీ ప‌లుమార్లు స‌మావేశం అయింది. ఇంత‌వ‌ర‌కూ భాగానే ఉన్నా.. ఇటీవ‌ల ప‌రిణామాలు మాత్రం చంద్ర‌బాబుకు రుచించ‌డం లేద‌ట‌. క‌మిటీ వేసినా ఎలాంటి ప్రాధాన్య‌తా లేకుండా చేశార‌ని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. స‌భ్యులు ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా ఉన్నార‌ట‌. స‌మావేశం ఉన్నా ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ట‌. పైగా క‌మిటీ సూచ‌న‌లు ఇవ్వాల‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించిన కేంద్రం.. నివేదిక ఇవ్వ‌క‌ముందే సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుని అమ‌లు చేస్తున్నార‌ట‌. క‌నీసం క‌మిటీ అభిప్రాయాలు తీసుకోవ‌డం కూడా లేద‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. అలాంట‌ప్పుడు క‌మిటీ ఎందుక‌ని.. చంద్ర‌బాబు అంటున్న‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు నిర్ణ‌యం అమ‌ల్లో రాష్ట్రాలను కూడా భాగ‌స్వామ్యం చేశామ‌ని విప‌క్షాల‌కు చెప్పుకోవ‌డానికి మాత్ర‌మే చంద్ర‌బాబు క‌మిటీ వేసిన‌ట్టు వాద‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి. అటు నీతిఆయోగ్‌, ఇటు ఆర్బిఐలు క‌మిటీతో చ‌ర్చించ‌కుండానే అవార్డులు, రివార్డులు, క్యాష్ ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తుండ‌డం ప‌ట్ల క‌మిటీలోని ఇత‌ర స‌భ్యులైన సిఎంలు, ప్ర‌ముఖులు కూడా అసంతృప్తిగా ఉన్నార‌ట‌. అందుకే చంద్ర‌బాబు నోట్ల ర‌ద్దుపై తిరుగుబాటుకు సిద్ద‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న అభిప్రాయం కూడా మార్చుకున్నార‌ని అంటున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.